Begin typing your search above and press return to search.
గురూజీ అండ వల్లే ఇదంతా చేయగలిగాడా?
By: Tupaki Desk | 23 Nov 2022 12:30 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ మధ్య మంచి స్నేహ బంధం వున్న విషయం అందరికి తెలిసిందే. పవన్ కు త్రివిక్రమ్ ఎంత చెబితే అంత అనే టాక్ కూడా వుంది. అది కొన్ని సందర్భాల్లో నిజమని తేలింది కూడా. త్రివిక్రమ్ కారణంగానే పవన్ కల్యాణ్ మలయాళ హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా తెరకెక్కిన 'భీమ్లానాయక్'లో నటించిన విషయం తెలిసిందే.
ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకుడు కాదు. కానీ ఆయనే మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఆ కారణంగానే పవన్ ఈ మూవీని మరో దర్శకుడు సాగర్ కె. చంద్ర డైరెక్షన్ లో చేశారన్నది అందరికి తెలిసిందే. ఇప్పడు ఇదే గురూజీ కారణంగా పవన్ మరో దర్శకుడితో వర్క్ చేయబోతున్నారట. తనే సుజీత్. ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాహో'కు దర్శకత్వం వహించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుజీత్ ఈ మూవీ తరువాత చాలా అవకాశాలు వచ్చినా ఏదీ చేయలేదు.
ఫైనల్ గా పవన్ కల్యాణ్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీనికి కారణంగా గురూజీ అని తెలుస్తోంది. త్రివిక్రమ్ కు సుజీత్ దగ్గర కావడం వల్లే తనకు పవన్ ని డైరెక్ట్ చేసే అవకాశం లభించిందని ఇన్ సైడ్ టాక్. తమిళ హిట్ ఫిల్మ్ 'తేరీ' రీమేక్ ని పవన్ తో సుజీత్ చేయబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ అవకాశం గురూజీ త్రివిక్రమ్ వల్లే తనకు వచ్చిందని చెబుతున్నారు.
గత కొంత కాలంగా 'తేరీ' కథపై వర్క్ చేస్తున్న సుజీత్.. త్రివిక్రమ్ సూచనలు, సలహాలు తీసుకుని తెలుగు నేటివిటీతో పాటు పవన్ కు అనుకూలంగా మార్చేశాడట. ఫైనల్ గా ఈ స్టోరీని పూర్తి చేసి మంగళవారం పవన్ కు ఫైనల్ వెర్షన్ వినిపించడం.. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం చక చకా జరిగిపోయాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మూవీని 'RRR' ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారట.
రీసెంట్ గా సుజీత్ చెప్పిన స్టోరీకి ఫిదా అయిపోయిన పవన్ వెంటనే తనకు ఫోన్ చేసి లంచ్ కి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. 'హరి హర వీరమల్లు' సెట్ లో వున్న పవన్ అక్కడే సెట్ లో తనతో లంచ్ కి సుజీత్ ని ఆహ్వానించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. త్వరలోనే 'తేరీ' రీమేక్ కు సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ రావడం ఖాయం అని తెలుస్తోంది. ఇదంతా గమనించిన వారంతా గురూజీ గైడెన్స్ వల్లే సుజీత్ చేయగలిగాడని చెబుతున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.