Begin typing your search above and press return to search.
అఖిల్‌ను చూసి శేష్ ఇన్‌స్పైర్ అయ్యాడా?
By: Tupaki Desk | 21 Jun 2022 4:19 AM GMTఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. నటుడిగా, రచయితగా తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు అడివి శేష్. అతను దర్శకుడిగా కూడా రెండు ప్రయత్నాలు (కర్మ, కిస్) చేశాడు కానీ.. అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ క్షణం దగ్గర్నుంచి యాక్టర్‌గా, రైటర్‌గా వరుసగా విజయాలందుకుంటూ దూసుకెళ్తున్నాడు. గూఢచారి, ఎవడు, తాజాగా మేజర్ అతడికి ఎంత మంచి గుర్తింపు తెచ్చాయో చెప్పాల్సిన పని లేదు.
ఐతే స్వశక్తితో ఇలా ఎదిగిన శేష్.. పెద్ద బ్యాగ్రౌండ్ ఉండి, సరైన సక్సెస్ అందుకోని అక్కినేని అఖిల్‌ను చూసి ప్రభావితం అయినట్లుగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడడం విశేషం. అఖిల్ పేరెత్తలేదు కానీ.. అతడ మాటల్ని బట్టి తనపై ఈ అక్కినేని కుర్రాడి ప్రభావం ఉందన్నది మాత్రం స్పష్టం. ఇంతకీ శేష్ ఏమన్నాడన్నది ఓసారి చూద్దాం.
"సినిమాల్లో చేయాలని నిర్ణయించుకుని పరిశ్రమలోకి అడుగు పెట్టి చిన్న చిన్న రోల్స్ చేస్తున్న సమయంలో టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరో తనయుడిని చూశా. అతను అప్పటికింకా పూర్తి స్థాయిలో సినిమాల్లోకి రాలేదు.
బాలనటుడిగా చిన్నతనంలో ఓ సినిమా చేశాడంతే. అతడికున్న క్రేజ్ చూసి తప్పకుండా నాకు కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నా" అని శేష్ తెలిపాడు.
ఈ మాటల్ని బట్టి చూస్తే.. శేష్ చెబుతున్నది అఖిల్ గురించే అని అర్థమైపోతుంది. బాల నటుడిగా ఓ సినిమా చేసి, హీరో కావడానికి ముందే మంచి క్రేజ్ తెచ్చుకున్నది అతనే. కాకపోతే హీరో అయ్యాక ఆ క్రేజ్ తగ్గుతూ వచ్చింది.
వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కోవడమే అందుక్కారణం. కానీ అరంగేట్రానికి ముందు అఖిల్‌ను చూసి అమ్మాయిలు వెర్రెత్తిపోయారు. ఆ క్రేజ్ చూసే అతడి తొలి సినిమాకు ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ ఫలితం తిరగబడింది. అఖిల్‌ను చూసి శేష్ ఇన్‌స్పైర్ కావడం కాదు కానీ.. ప్రభావితం అయ్యాడని అర్థమవుతోంది.