Begin typing your search above and press return to search.
ప్రేక్షకుల వాష్ రూమ్ లో సినిమా దెయ్యం
By: Tupaki Desk | 29 Jun 2019 10:04 AM GMTకాదేది సినిమా ప్రమోషన్ కు అనర్హం అని ఎవరైనా అన్నారో లేదో కానీ ఈ సూత్రం ఇప్పుటి ట్రెండ్ కు బాగా వర్తిస్తుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి దర్శక నిర్మాతలు రొటీన్ గా పబ్లిసిటీ చేస్తే జనం రావడం లేదు. అందుకే కొత్త కొత్త జిమ్మిక్కులు తప్పడం లేదు. సందీప్ కిషన్ కొత్త సినిమా నిను వీడని నీడను నేనే టీం ఒకడుగు ముందుకు వేసి ఏకంగా థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల వాష్ రూమ్ లోకి వెళ్లిపోయింది. హారర్ జానర్ లో రూపొందిన ఈ కామెడీ థ్రిల్లర్ లోని థీమ్ ప్రెజెంట్ చేసేలా డిజైన్ చేసిన కొన్ని కోట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ప్రకృతి ధర్మాన్ని నెరవేర్చడం కోసం టాయిలెట్ లోకి వెళ్లిన ఆడియన్స్ కు అక్కడ నీ సీట్ పక్కన కూర్చున్నది నేనే దెయ్యం కదా కనిపించి ఉండను అని చెప్పడం వెరైటీగా ఉంది. అదే ఒక ఎత్తు అనుకుంటే నాకు హారర్ ఫిలిమ్స్ అంటే భయం త్వరగా జిప్ మూసేయ్ అని మరో పోస్టర్ పెట్టడం అసలు ట్విస్ట్. సరదాగా నవ్వుకుంటూనే ప్రేక్షకులు వీటిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదో వెరైటీ పోకడ అని చర్చించుకుంటున్నారు.
ఇదేదో బాగానే ఉందని అందరూ ఫాలో అయితే ఇకపై ప్రతి వాష్ రూమ్ లోనూ పోస్టర్లు ట్రైలర్లు వేసి రచ్చ చేస్తారేమో, సినిమాల వరకు అయితే పర్వాలేదు కానీ మల్టీ ప్లెక్సుల్లో ఇటీవలి కాలం విపరీతంగా పెరిగిపోయిన కార్పొరేట్ యాడ్స్ ని వీటిలో కూడా వేస్తే ఇకపై బాత్ రూమ్ ఛాయలకు వెళ్ళడానికి జనం ఆలోచిస్తారేమో. ఏదైనా నిను వీడని నీడను నేనే యూనిట్ మాత్రం భలే ట్రెండీగా ఆలోచించింది. అయితే హీరోతో పాటు దెయ్యం పాత్రకు వాష్ రూమ్ కనెక్షన్ ఉండటం వల్లే ఇలా ప్లాన్ చేశారట.