Begin typing your search above and press return to search.

బాహుబలి ఫస్ట్‌ షో టాక్‌: వాటర్‌ఫాల్స్‌ కేక

By:  Tupaki Desk   |   10 July 2015 4:19 AM GMT
బాహుబలి ఫస్ట్‌ షో టాక్‌: వాటర్‌ఫాల్స్‌ కేక
X
''బాహుబలి'' ఫస్టాఫ్‌లో ఏకంగా ఓ అరగంటపాటు కనిపించేది ఈ వాటర్‌ ఫాల్సే. ఆల్రెడీ మనకు రాజమౌళి ట్రైలర్‌లో స్పష్టంగా చెప్పశాడు... ఈ వాటర్‌ ఫాల్స్‌తో మ్యాజిక్‌ చేయబోతున్నా అని. చెప్పిన మాట మీదనే నిలబడ్డాడు గురుడు. కర్ణాటకలోని మహాబలేశ్వరంలో షూట్‌ చేసిన ఫుటేజ్‌కు బ్యాగ్రౌండ్‌ వాటర్‌ ఫాల్స్‌ మిక్స్‌ చేసిన తీరున అమోఘం. సినిమా అయిపోయాక్కూడా మెదడులో ఇంప్రింట్‌ అయిపోయే రేంజు క్రియేటివిటీ ఇది.

చిన్నప్పటినుండి ఆ అద్భుతమైన జలపాతం పైన ఏముందో తెలుసుకోవాలని తహతహలాడుతుంటాడు శివుడు. ఇక అతగాడి ఆసక్తికి తగ్గట్లే ఆ వాటర్‌ ఫాల్స్‌ కూడా ఎంతో అమోఘంగా, పెద్దగా ఉంటాయి. వాటి పక్కనుండి కొండనెక్కేసి పైకి వెళ్ళిపోవడం అంటే అంత తేలిక కాదు. సినిమాలో మొదటి పావుగంటా ఈ ఫాల్సే దగ్గరే చోటు చేసుకుంది. అంతేకాదు.. ఈ ఫాల్స్‌ను సెంథిల్‌ తన లో-యాంగిల్‌ కెమెరా వర్కుతో అద్భుతంగా చూపించాడు.

ఈ మిల్కీ జలపాతం బ్యాగ్రౌండ్‌లోనే రాజమౌళి దీవరా.. అనే పాటను కూడా తీశాడు. ఆ పాటలో జలపాతం సాక్షిగా ఎన్ని ఫీట్లు చేయించాలో తమన్నా-ప్రభాస్‌లతో అన్నీ చేయించేశాడు. నిజ జీవితంలో ఇలాంటి భీకర భయంకర జలపాతం ఎక్కడైనా ఉందా అంటే కేవలం నయాగరా జలపాతం అనే చెప్పాలి. వెండితెరపైన ఈ రాజమౌళి జలపాతం చూస్తే వర్షాకాలంలో హిల్‌ స్టేషన్‌కు వెళ్లి తడసిముద్దయిపోయినట్లు చలి వేసింది.