Begin typing your search above and press return to search.

సమంత - చిన్మయి మీవి శ్రీరంగ నీతులేనా?

By:  Tupaki Desk   |   18 July 2019 1:30 AM GMT
సమంత - చిన్మయి మీవి శ్రీరంగ నీతులేనా?
X
నేను చెప్పే నీతులు ఇతరులకు మాత్రమే.. నాకు వర్తించవు అన్నట్లుగా సమంత.. చిన్మయి తీరు ఉందంటూ నెటిజన్స్‌ సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్స్‌ చేస్తున్నాయి. ఎక్కడైనా చిన్న కాస్టింగ్‌ కౌచ్‌ విషయం కనిపించినా లేదంటే లైగింక వేదింపుల వార్త కనిపించినా కూడా వెంటనే తన సోషల్‌ మీడియా పేజ్‌ లో చిన్మయి ఆ విషయాన్ని పోస్ట్‌ చేస్తూనే ఉంటుంది. ఆమద్య ఏదో లైంగిక వేదింపుల వార్త రాగానే అది నిజమేనా అనే విషయం కూడా తెలుసుకోకుండా పోస్ట్‌ చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. అంత ఉత్సాహంగా లైంగిక వేదింపుల కేసుల విషయంలో చురుకుగా ఉండే చిన్మయి తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న బిగ్‌ బాస్‌ కాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో మాత్రం స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు.

బిగ్‌ బాస్‌ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి సమంత మరియు చిన్మయి నోరు విప్పాల్సిందే అంటూ నెటిజన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. బిగ్‌ బాస్‌ నిర్వాహకులు తమను ఇబ్బంది పెట్టారంటూ శ్వేత రెడ్డి మరియు గాయత్రి గుప్తలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన విషయం తెల్సిందే. వారి ఫిర్యాదుతో ప్రస్తుతం రచ్చ రచ్చ అవుతోంది. ఈ నేపథ్యంలో చిన్మయి ఇప్పటి వరకు స్పందించక పోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాగార్జున హోస్ట్‌ చేస్తున్న షో కనుక చిన్మయి స్పందించడం లేదని.. ఆ కారణం వల్లే సమంత మౌనంగా ఉంటుందని నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు.

గతంలో చిన్మయి చేసిన పలు కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలను మరియు పలు వివాదాలను సమర్ధిస్తూ సమంత కూడా సోషల్‌ మీడియాలో తన వాయిస్‌ వినిపించింది. కాని ఇప్పుడు ఇద్దరు ఆడవారు బిగ్‌ బాస్‌ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఆరోపణలు చేస్తుంటే కనీసం వారి విషయాన్ని వీరు పట్టించుకోవడం లేదు. అందుకే వీరు బయటి వారి విషయంలో మాత్రమే నీతులు చెబుతారు.. తమ అనుకుంటే నోరు మెదపరు అంటూ ట్రోల్స్‌ వస్తున్నాయి. మరి ఈ విమర్శలకు చిన్మయి మరియు సమంతలు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.