Begin typing your search above and press return to search.
లాజిక్ మిస్ అవుతున్న తాప్సీ
By: Tupaki Desk | 29 Jan 2018 7:48 AM GMTపింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజం ముందు తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాను అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన నమ్మకమో లేక ఇంకేదైనా కారణమో తెలియదు కాని సొట్ట బుగ్గల సుందరి తాప్సీ తరచుగా ఏదో ఒక ఇష్యూ మీద కామెంట్స్ చేయకుండా ఉండలేకపోతోంది. ఆ మధ్య తన మొదటి సినిమా ఝుమ్మంది నాదంలో నాభిపై దర్శకులు రాఘవేంద్ర రావు కొబ్బరి చిప్ప వేయించడం గురించి ముంబై మీడియా ముందు వ్యంగ్యంగా మాట్లాడి చివరికి నేను ఆ ఉద్దేశంతో అనలేదు మహాప్రభో అనే దాకా తెచ్చుకుంది. ఇటీవలే సౌత్ సినిమాలపై మరోసారి సెటైర్లు వేస్తూ తన కోసం ఎంతకాలమైన వేచి చూసే వాళ్ళకే సినిమాలు చేస్తానని కాస్త అతిశయోక్తిగా మాట్లాడింది. ఇప్పుడు స్టార్ వారసుల మీద పంచులు వేసే ప్రయత్నం చేసింది.
ఇక్కడ తన లాంటి వాళ్ళు స్వంత టాలెంట్ తో కష్టపడి పైకి వస్తుంటే కేవలం స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చాం అన్న ఒకే ఒక్క కారణంతో అన్ని తమ నుంచి లాక్కుంటారు అని అర్థం వచ్చేలా తాప్సీ కామెంట్ చేయటం మరోసారి చర్చకు తీస్తోంది. బాలీవుడ్ లో ఆరు నెలల క్రితం ఇదే టాపిక్ మీద కరణ్ జోహార్ - కంగనా రౌనత్ గొడవలు పడే దాకా వెళ్లారు. సైఫ్ ఆలి ఖాన్ - వరుణ్ ధావన్ కూడా ఇందులో చేరి నానా రచ్చ చేసారు. చివరికి ఎవరికి వారు సారీ చెప్పి దాన్ని సద్దుమణిగేలా చేసుకున్నారు కాని నెపోటిజం అంటూ బాలీవుడ్ మీడియా కొన్ని నెలల పాటు ఇదే టాపిక్ మీద అట్టుడికిపోయింది, చల్లారాక తాప్సీ మళ్ళి మొదలుపెట్టే ప్రయత్నం చేస్తోంది.
కానీ ఎంత స్టార్ హీరో కిడ్స్ అయినా ఇక్కడ టాలెంట్ చాలా ఇంపార్టంట్ అనే విషయం మర్చిపోకూడదు. అమితాబ్ ఎంత గొప్ప నటుడైనా అభిషేక్ ఆయన సాధించిన దాంట్లో పావలా వంతు కూడా చూపించలేదు. ఎస్వి రంగారావు గారి మనవడిని తెరకు పరిచయం చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ గారి సంతానం లో బాలకృష్ణ - హరికృష్ణ మాత్రమే నటులుగా స్థిరపడ్డారు. మిగిలినవారు వేరే వ్యాపకాల్లో ఉన్నారు. పవన్ సక్సెస్ అయ్యాడు కానీ చిరు తమ్ముడు నాగబాబుది హీరోగా ఫెయిల్యూర్ స్టొరీనే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వారసుల మీద కామెంట్ చేయటం బాగానే ఉంది కాని కొన్ని లాజిక్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుంటే బెటర్ కదా.