Begin typing your search above and press return to search.
బాధను దిగమింగుకుని స్టూడియోను అమ్మేస్తున్నాం!
By: Tupaki Desk | 26 Aug 2018 2:30 PM GMTబాలీవుడ్ కు చెందిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మాణం జరిగిన ఆర్కే స్టూడియోను అమ్మేయాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. బాలీవుడ్ స్టార్ - లెజెండ్రీ నటుడు - నిర్మాత అయిన రాజ్ కుమార్ నిర్మించిన ఆర్కే స్టూడియోలో గత సంవత్సరం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అప్పటి నుండి ఆర్కే స్టూడియోలో నిర్మాణం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. స్టూడియోను పునర్ నిర్మించేందుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్న కారణంగా రాజ్ కుమార్ వారసులు స్టూడియోను అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
తాజాగా రాజ్ కుమార్ తనయుడు రిషి కపూర్ ఈ విషయమై మాట్లాడుతూ.. తమకు ఎంతో సెంటిమెంట్ - భావోద్వేగపు మేళ్లవింపు అయినప్పటికి ఆర్థిక కారణాల వల్ల స్టూడియోను అమ్మేయాలని కుటుంబ సభ్యులందరం నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పునర్ నిర్మించేందుకు ప్రయత్నాలు చేశాం. కాని అందుకు ఆర్థికంగా భారీ ఎత్తున ఖర్చు అవ్వడంతో పాటు, ఆ తర్వాత లాభాలు వస్తాయన్న నమ్మకం లేదు. అందుకే స్టూడియో పునరుద్దరణ నిర్ణయంను ఉపసంహరించుకున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. స్టూడియోలో అగ్నిప్రమాదం జరగకముందు నుండే ఆర్థిక ఇబ్బందుల్లో నడుస్తూ వస్తుంది.
స్టూడియోలో సీరియల్స్ - చిన్న చిత్రాల నిర్మాణం జరుగుతున్నా కూడా లాభాలు రావడం లేదు. అప్పట్లో అధునాతన టెక్నాలజీతో ఆర్కే స్టూడియోను అప్ గ్రేడ్ చేయాలని భావించాం. కాని ఆర్థిక వనరులు లేకపోవడంతో ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు. స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి ఈ స్టూడియోను నిర్మించడం జరిగింది. రాజ్ కుమార్ జ్ఞాపకార్థం స్టూడియోను కనీసం ప్రభుత్వం అయిన స్వాదీనం చేసుకుని అలాగే ఉంచితే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. బయట వ్యక్తులు ఈ స్టూడియోను కొనుగోలు చేస్తే కమర్షియల్ అవసరాలకు స్థలంను వాడేసే అవకాశం ఉందని, అలా జరిగితే రాజ్ కుమార్ జ్ఞాపకాలు అన్ని మిస్ అవుతామని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. అమ్మేసి చేతులు దులిపేసుకోవాలని వారు భావిస్తున్నారు.