Begin typing your search above and press return to search.

మేం విడిపోతే.. మీకెందుకు చెప్పాలి?

By:  Tupaki Desk   |   28 March 2016 5:31 AM GMT
మేం విడిపోతే.. మీకెందుకు చెప్పాలి?
X
మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ జంట బ్రేకప్ చెప్పేసుకున్నారని ఇప్పటికే న్యూస్ ఉంది. అయితే.. దీనిపై ఈ జంట అఫీషియల్ గా మాట్లాడకపోవడంతో.. చాలానే కన్ఫ్యూజన్ జనరేట్ అయింది. దీనికి తోడు వాళ్లతో ఎఫైర్లు - వీళ్లతో రిలేషన్స్ అంటూ రకరకాల రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. వీటన్నిటితో విడిపోయిన ఈ జంట ఇప్పుడు జాయింట్ గా ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు.

'మా కుటుంబ విషయాల గురించి మేం సైలెంట్ గా ఉండేందుకు చాలా ప్రయత్నించాం. కానీ ఇప్పుడొస్తున్న అనేక రూమర్స్ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇలాంటి వాటన్నిటికీ చెక్ చెప్పేందుకు ఇలా ఉమ్మడిగా ఓ ప్రకటన చేయాల్సి వస్తోంది. మా స్నేహితులు - సన్నిహితులు అనే పేర్లతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. మాతో చాలా కాలంగా అనుబంధం ఉన్నవారు కూడా సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. ఇలా విడిపోయవడం అనేది మా పర్సనల్ వ్యవహారం. మా కుటుంబ వ్యవహారాలు కూడా ఇందులో ఇమిడి ఉండడంతో మేం సైలెంట్ గానే ఉంటున్నాం. అలాగని ఇష్టం వచ్చినట్లు రాస్కోవడానికి ఎవరికీ హక్కు లేదు.' ఇదే మలైకా - అర్బాజ్ ల ఉమ్మడి స్టేట్మెంట్.

అంతే కాదు.. మాకు ఒకరిపై ఒకరికి నమ్మకం - గౌరవం ఉన్నాయి. ఇప్పుడు విడిపోయినంత మాత్రాన విడాకులు తీసేసుకున్నాం అని చెప్పలేమని.. తాము అధికారికంగా ప్రకటించేవరకూ ఎలాంటి పుకార్లను నమ్మద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు ఈ జంట. అలాగే.. తమ మధ్య విబేధాలు పర్సనల్ అని ఎవరికీ చెప్పాల్సిన పని లేదని తేల్చేశారు కూడా.