Begin typing your search above and press return to search.

దీపిక ఫస్ట్ లవర్ ఏమన్నాడంటే...

By:  Tupaki Desk   |   6 Jan 2016 3:30 PM GMT
దీపిక ఫస్ట్ లవర్ ఏమన్నాడంటే...
X
దీపికా పదుకొనే - రణ్ వీర్ సింగ్ ల రిలేషన్ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్ గా బాజీరావు మస్తానీ ప్రమోషన్స్ సమయంలో వాళ్లు కూడా ఓపెన్ అయిపోయారు. మరి జనవరి 5న 30వ పుట్టినరోజు జరుపుకున్న దీపికాకి.. ఫస్ట్ లవర్ ఎలాంటి విషెస్ చెప్పాడో తెలుసా ? దీపికా పదుకొనే ఫస్ట్ లవర్ నీహార్ పాండ్యా అనే విషయం ఎక్కువ మందికి తెలీదు. కానీ ఇతగాడు కాస్త స్పీడుమీదే ఉంటాడు.

స్కూల్ రోజుల నుంచి రన్నింగ్ ఛాంపియన్ కావడంతో ఆ స్పీడ్ అలవాటులెండి. అంతేకాదు ముంబై తరపున అండర్ 16 - అండర్ 19కి కూడా ప్రాతినిధ్యం వహించాడు. అంతేనా కథక్ డ్యాన్సర్ కూడా. ఇన్ని స్పెషాలిటీస్ ఉండి సినిమా యాక్టర్ కాకపోవడమేంటి అనుకోవచ్చు కానీ.. అసలు దీపికా - నీహార్ లు ఒకేసారి సినిమాల్లో ట్రయల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య బంధం బలపడింది కూడా. అయితే.. దీపికతో కటీఫ్ అయిన తర్వాత గౌహర్ ఖాన్ తో కూడా కొన్నాళ్లు వ్యవహారం నడిపించాడు నీహార్ పాండ్యా. అయితే.. ఇప్పటికీ దీపికా పదుకొనేతో టచ్ లోనే ఉంటున్నానని, ఆమె సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు.

ప్రతీ ఏడూ.. ముందరి ఏడాదికి మించి ఆమె సక్సెస్ లు సాధించాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్ చెప్పాడు. అలాగే.. దీపికకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఈ స్థాయికి చేరుకుందని, తనకు ఇంకా ఆ టైం రాలేదన్నాడు నీహార్. సినిమా హీరో అవడానికి అన్న అర్హతలు సెట్ చేసుకున్న ఇతగాడు.. ఈ 2016లో తనకు ఖచ్చితంగా అవకాశం వస్తుందని నమ్ముతున్నాడు.