Begin typing your search above and press return to search.
అంత టర్నింగ్ ఎక్కడ మారిందబ్బా!!
By: Tupaki Desk | 17 Sep 2018 8:20 AM GMTనాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడుతో పోటీగా విడుదలైన సమంతా యుటర్న్ మంచి స్పందనతో బాగానే దూసుకుపోతోంది. ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో ఏ సెంటర్స్ లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతున్న ఈ థ్రిల్లర్ మూవీ ఊహించని మలుపులతో ప్రేక్షకులను మెప్పించిన మాట నిజం. టేకింగ్ కాస్త స్లోగా అనిపించినా ఫైనల్ గా ప్రేక్షకుడిని సంతృప్తి పరిచి పంపడంలో దర్శకుడు పవన్ సక్సెస్ అయ్యాడు. ఈ మేరకు సంతోషం వ్యక్తం చేస్తున్న పవన్ తెలుగు తమిళ బైలింగ్వల్ వెర్షన్ కోసం చివరి అరగంట మొత్తం మార్చేశానని ఒరిజినల్ కన్నడ తో పోలిస్తే భయం పాలు ఎక్కువ చేసానని చెబుతున్నాడు. కానీ నిజానికి రెండు వెర్షన్లు చూసినవాళ్లకు ఈ విషయంలో పూర్తి క్లారిటీ ఉంది. మొత్తంగా ఓ ఐదు నుంచి పది నిమిషాల మధ్య తప్ప పెద్దగా మార్పులు చేర్పులు ఏమి చేయలేదు అన్నది వాస్తవం. ఫస్ట్ షాట్ నుంచి ఫ్రేమ్ టు ఫ్రేమ్ యధాతదంగా తీసిన పవన్ పాతిక శాతం మార్చేశానని చెప్పుకోవడం వింతే.
అంటే ఆ వెర్షన్ ఎవరూ చూసుండరు అనే నమ్మకమో ఏమో కానీ నెట్ ఫ్లిక్స్ లో యుట్యూబ్ లో కొంత మొత్తం చెల్లిస్తే చాలు అందుబాటులో ఉన్న కన్నడ ప్రింట్ ని చూస్తే ఎవరైనా అంత మార్పు ఎక్కడుందని అడగటం ఖాయం. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లో చిన్న మార్పు తప్పితే ఇంకే చేంజ్ లేదు. అది ఏంటి అనేది ఇక్కడ పోల్చి చెప్పడం భావ్యం కాదు కాబట్టి స్పష్టత ఇవ్వడం లేదు. అయినా ప్రపంచం నలుమూలల ఉన్న వివిధ బాషా సినిమాలను చిటికెన వేళ్ళతో నొక్కుతూ చూస్తున్న ట్రెండ్ లో ఇలా లేనిది ఉన్నట్టు చెప్పడం భావ్యమా. యుటర్న్ లో స్టార్ హీరో లేరు కాబట్టి ఒరిజినల్ వెర్షన్ మీద అంత ఫోకస్ వెళ్ళలేదు. రామ్ చరణ్ ధృవ చేస్తున్న టైంలో పోటీ పడి మరీ తమిళ ఒరిజినల్ తని ఒరువన్ చూసిన వారెందరో యుటర్న్ మీద ఆ రేంజ్ హైప్ లేదు కాబట్టి ప్రీ రిలీజ్ కు ముందు ఒరిజినల్ చూసిన వాళ్ళు తక్కువ. అయినా సరే కొంత మార్చి అరగంట అని చెప్పడం రైట్ కాదేమో.