Begin typing your search above and press return to search.

మేము వాళ్ళని కేర్ చెయ్యమంటున్న రష్మిక

By:  Tupaki Desk   |   3 March 2019 9:31 AM GMT
మేము వాళ్ళని కేర్ చెయ్యమంటున్న రష్మిక
X
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు కన్నడ మాత్రమే కాకుండా తెలుగులో కూడా క్రేజీ హీరోయిన్. తమిళంలో ఒక్క సినిమా చేయలేదు కానీ అక్కడ కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక ముక్కలో చెప్తే సౌత్ అంతా రష్మిక కు క్రేజ్ ఉంది. ఈ సోషల్ మీడియా జెనరేషన్ లో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ట్రోలర్స్ బారిన పడకుండా తప్పించుకోలేరనే సంగతి తెలిసిందే. దానికి రష్మిక కూడా ఎక్సెప్షన్ ఏమీ కాదు.

రష్మిక - రక్షిత్ శెట్టి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన సమయంలో చాలామంది నెటిజనులు రష్మికను తీవ్రంగా ట్రోల్ చేశారు. అదొక్కటే కాకుండా చాలా సార్లు వేరే విషయాలలో కూడా రష్మిక ట్రోలింగ్ బారిన పడింది. అలాంటి సందర్భాలలో రష్మిక ఎలా ఫీలయింది? దానికి రష్మిక స్పందన ఏంటి? రీసెంట్ గా రష్మికను ఈ ప్రశ్నలు అడిగినప్పుడు ఇంట్రెసింగ్ ఆన్సర్ ఇచ్చింది రష్మిక. "వాళ్ళు మమ్మల్ని కేర్ చెయ్యరు. మేము వాళ్ళని కేర్ చెయ్యం. ట్రోల్ చేయడం వారికి ఆనందాన్ని ఇచ్చే పనైతే చేసుకోనివ్వండి" అని తన అభిప్రాయం వెల్లడించింది.

తనకు అభిమానులే ఎంతో అండ అని.. వారి మద్దతుతోనే ఈ నెగెటివిటీని ఎదుర్కోగలుగుతున్నానని చెప్పింది. నిజమే.. ట్రోలింగ్ ను పట్టించుకుంటే ఎవరికైనా త్వరగా బీపీలు.. షుగర్లు వచ్చేస్తాయి. ఎందుకంటే నెటిజనులలో ఒక సెక్షన్ కు కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ముఖ్యమైన పని. వారిని సంతోషపెట్టడం ఏ గాడ్ వల్ల కూడా కాదు అలాంటిది 'గీత' ఏం చేయగలుగుతుంది?