Begin typing your search above and press return to search.
ప్రకాష్ రాజ్ ని అధ్యక్షుడిగా ఒప్పుకోం!
By: Tupaki Desk | 23 Jun 2021 3:18 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు అంతకంతకు వేడి పెంచుతున్నాయి. సెప్టెంబర్ లో జరగనున్న మా ఎన్నికల్లో ప్రధాన పోటీ మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ ప్యానెళ్ల నడుమ జరగనుండగా.. ఎవరికి వారు మద్ధతును కూడగట్టుకుంటున్నారు. అయితే ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ చిరంజీవి మద్ధతు ఉంటుందని నేను అనుకోవడం లేదని ఆయన అందరికీ సపోర్టుగా నిలుస్తారని `మా` సభ్యురాలు కరాటే కళ్యాణి అన్నారు. అలాగే ప్రకాష్ రాజ్ స్థానికతను సూటిగా ప్రశ్నించారు. పొరుగు భాష నుంచి వచ్చి ఇక్కడ ఆయన అధ్యక్షుడు ఎలా అవుతారు? అని నిలదీసారు.
``ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు. ఆర్టిస్టుగా ఆయన్ని నెత్తిమీద పెట్టుకుంటాం.. అవార్డులిస్తాం.. కానీ అధ్యక్ష పదవికి ఒప్పుకోలేం. తెలుగు వారే మా అధ్యక్షులు కావాలనేది నా అభిప్రాయం`` అని కళ్యాణి అన్నారు.
నడిగర సంఘం లో అయితే మమ్మల్ని పోటీ చేయనిస్తారా? మనం వెళ్లి పోటీ చేయగలమా? అని కూడా కళ్యాణి ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ మంచి నటుడు.. తెలుగు వారికి చేరువైన వ్యక్తి.. సామాజిక సేవ చేస్తారు. కానీ ఇక్కడ అధ్యక్షుడిగా ఎలా పోటీ చేస్తారు? అన్నదే అర్థం కావడం లేదని కళ్యాణి అన్నారు. బాగా పాలిస్తున్నారు కదా అని స్టాలిన్ ని తీసుకుని వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని చేయలేం కదా? అని ప్రశ్నించారు. మనకు జగన్ -కేసీఆర్ ఉన్నారని అన్నారు.
ఇరుగు పొరుగు భాషల్లో తెలుగు వారికి కనీసం వేషాలు కూడా ఇవ్వకుండా కట్టడి చేస్తుంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ప్రకాష్ రాజ్ ని పోటీ చేయనిస్తారు? అని నిలదీసారు. ఆయన అదోరకం .. సరిగా మాట్లాడనే మాట్లాడరు అని కూడా ప్రకాష్ రాజ్ వ్యవహారికాన్ని కళ్యాణి విమర్శించారు. స్థానికతను ప్రశ్నించే వారికి విలక్షణ నటుడు ఎలాంటి కౌంటర్ వేస్తారో చూడాలి.