Begin typing your search above and press return to search.

వ్యాపారులను మనమే కాపాడాలి.. అంటున్న స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   7 April 2020 3:30 AM GMT
వ్యాపారులను మనమే కాపాడాలి.. అంటున్న స్టార్ హీరోయిన్
X
కరోనా కారణంగా దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విధంగా 21 రోజుల లాక్ డౌన్ ను ఖచ్చితంగా పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ కరోనా దెబ్బతో సామాన్యుడి దగ్గర నుండి నాయకులు, సినీ సెలబ్రిటీల వరకు అందరూ ఎవరి ఇళ్లకు వారే పరిమితమయ్యారు. గత రాత్రి ప్రధాని చెప్పిన విధంగా 9గంటలకు 9నిముషాల వ్యవధిలో భారతదేశం మొత్తం దీపకాంతులను వెలిగించారు. ఈ లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పై కరోనా ప్రభావం మాత్రం ఘోరంగా పడింది. అయితే ఈ దీపాల కార్యక్రమంలో బ్యూటీఫుల్ నటి కాజల్ అగర్వాల్ కూడా పాల్గొందట. తను కూడా నిన్న రాత్రి 9గంటలకు దీపాలు వెలిగించి సంఘీభావం తెలియజేసానని చెప్పింది.

ఆ వెంటనే ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసి కాజల్ అగర్వాల్ దేశ ప్రజలతో తన సందేశాన్ని పంచుకుంది. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత స్థానిక వ్యాపారులకు, వ్యాపార సంస్థలకు ప్రజలంతా మద్దతు తెలపాలని కోరింది. కరోనా అయిపోగానే మన దేశానికి మంచి చేయాల్సిన బాధ్యత మనపై ఉందంటూ.. మీ సెలవులన్ని ఇండియాలోనే గడపండి, బయట తినేవాళ్లు స్థానిక రెస్టారెంట్, హోటల్స్ లో తినండి. ఇండియాలో పండించిన కూరగాయల్ని, పండ్లను కొనండి. ఇండియన్ బ్రాండ్ల షూ, క్లోత్స్ కొని భారత్ వ్యాపారులకు సహాయం చేయండని తెలిపింది. మనం సహాయం లేకుండా దెబ్బ తిన్న భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కష్టమంటూ గుర్తుచేసింది. ఇలా కరోనా తర్వాత ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చింది బ్యూటీఫుల్ కాజల్.