Begin typing your search above and press return to search.

ఆరోగ్యమే అసలైన సంపద: తమన్నా

By:  Tupaki Desk   |   9 April 2015 5:30 AM GMT
ఆరోగ్యమే అసలైన సంపద: తమన్నా
X
వేకువఝామునే లేవడం యోగా, ధ్యానం చేయడం.. అవసరం మేర రన్నింగు, జాగింగు చేయడం.. ఇవన్నీ ఆరోగ్యానికి ఉపకరించే సూత్రాలు. ఎంత సంపాదించాం? అనేదానికంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నాం? అన్నదే ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అదే అసలైన సంపద. అది లేకపోతే ఏమీ లేనట్టే అంటూ సుదీర్ఘంగా క్లాస్‌ తీసుకుంది మిల్కీ వైట్‌ బ్యూటీ తమన్నా.

ఆరోగ్యం కోసం మిల్కీ ఏమేమి చేస్తుందో చెప్పింది. యోగాతో పాటు ఎక్సర్‌సైజులు చేస్తూ శరీరాన్ని నిత్యనూతనంగా ఉంచుకుంటా. ఉదయమే కసరత్తులు చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటుందని చెప్పింది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో రాకుమారి పాత్రలో అదరగొట్టేసిందని ఇప్పటికే ప్రచారమైంది. తమ్మూ ప్రస్తుతం తమిళ చిత్రాలతోనూ బిజీగా ఉంది. కాబట్టి ఈ బిజీ జీవితంలో ఆరోగ్యం విలువెంతో తనకి ప్రాక్టికల్‌గా తెలిసొచ్చింది.

ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే వచ్చే పరిణామాల్ని ముందే ఓ అంచనా వేసి ఇలా చెబుతోందన్నమాట! కేవలం డబ్బు డబ్బు అని కొట్టుకుపోతే ఇక దాని పర్యవసానాలు అంతే సీరియస్‌గా ఉంటాయని చెప్పకనే చెప్పింది అమ్మడు.