Begin typing your search above and press return to search.
ఆఫరిస్తామని వెంటపడితే తప్పించుకు తిరుగుతున్న స్టార్ హీరో!
By: Tupaki Desk | 10 Sep 2021 2:30 AM GMTమాస్ రాజా రవితేజ మళ్లీ క్రాక్ సక్సెస్ తో ట్రాక్ లోకి వచ్చేసారు. మళ్లీ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం `ఖిలాడీ`...`రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాల్లో నటిస్తున్నారు. ముందుగా ఖిలాడీ అటుపై రామారావు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తాజాగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ ని బయటకు తీసారు. ఆ చిత్రాన్ని ఆక్టోబర్ లో లాంచ్ చేయడానికి ముహూర్తం పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంకా రాజా మెచ్చిన స్క్రిప్ట్ లన్నింటిని వెకదాని వెంట ఒకటి తెరకెక్కించాలని పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఈ చిత్రాలకు గాను రవితేజ భారీగానే పారితోషికం అందుకుంటున్నారు.
ఇదే సమయంలో మాస్ రాజాకి వెబ్ సిరీస్ ల అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ ఓటీటీ సంస్థలైన నెట్ ప్లిక్స్..అమెజాన్ ప్రైమ్ సంస్థలు రాజా వెంట పడుతున్నాయట. ఎలాగైనా తెలుగులో హీరోతో వెబ్ సిరీస్ మొదలు పెట్టి ఇక్కడా తమ బిజినెస్ ని బిల్డ్ చేసుకోవాలని గట్టి ప్రయత్నాల్లో భాగంగా సదరు కార్పొరెట్ సంస్థలు రాజాపై ఫోకస్ చేసినట్లు సమాచారం. స్టార్ కిడ్స్ సహా అగ్ర హీరోలంతా ఎప్పుడూ బిజీ కావడంతో వెబ్ సిరీస్ లు చేయడానికి ఎవరూ తొందరగా ముందుకు రావడం లేదట. ఈ నేపథ్యంలోనే రవితేజ అయితేనే బెటర్ అని ఓటీటీలు భావిస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ రవితేజ కూడా అందుకు రెడీగా లేనట్లు సమాచారం.
ఇన్నాళ్లు పెద్ద తెరపై చూసిన రవితేజని బుల్లి తెరపై చూస్తే పెద్ద మార్కెట్ దెబ్బతింటుందనో ఏమో! ఆసక్తి చూపించడం లేదని టాక్ వినిపిస్తోంది. అలాగైతే రవితేజకు సినిమా రేంజ్ లో పారితోషికం ఇస్తే ఓటీటీలకు ఒకే చెప్పే అవకాశం ఏమైనా ఉంటుందేమో చూడాలి అన్న ప్రచారం తెరపైకి వస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ ఉంది. కొత్త వాళ్లకు వెబ్ సిరీస్ లు మంచి వేదికలు అవుతున్నాయి. అక్కడ తమ ట్యాలెంట్ ని ప్రూవ్ చేసుకుని వెండి తెరకు ప్రమోట్ అవుతున్నారు.
ఓటీటీలో కింగ్ ప్రవేశం?
OTT లో నాగార్జున రెండు జాతీయ ప్రాజెక్టులు
కింగ్ నాగార్జున త్వరలోనే ఓటీటీలో రంగ ప్రవేశం చేయనున్నారని ఇటీవల కథనాలొస్తున్నాయి. ఇంతకుముందు వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ లో ఆయనే ధృవీకరించారు కూడా. ``నాకు రెండు జాతీయ స్థాయి వెబ్ సిరీస్ లలో అవకాశాలు వచ్చాయి. అవి రెండూ ఎగ్జయిట్ చేసేవే.. నేను కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాను`` అని కింగ్ వెల్లడించారు.
దీనిని బట్టి బాలీవుడ్ స్టార్ల తరహాలోనే OTT ని సీరియస్ గా తీసుకున్న తొలి టాలీవుడ్ స్టార్ నాగార్జున కానున్నారని అర్థమవుతోంది. ఇప్పటికే నాగార్జున కోడలు సమంత ఓటీటీలో రంగ ప్రవేశం చేశారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజీ అనే తీవ్రవాది పాత్రతో సంచలనంగా మారారు. సామ్ ఓటీటీ ఎంట్రీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అక్కినేని నాగచైతన్య కూడా ఓటీటీపై ఆసక్తిగా ఉన్నారు. అయితే నాగార్జున నటించే వెబ్ సిరీస్ లకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కియరా-రాధిక ఆప్టే-తమన్నా - కాజల్ తదితర నాయికలు ఇప్పటికే ఓటీటీల్లో గొప్ప ఆదరణ దక్కించుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ సహా పలువురు స్టార్లు ఓటీటీ వేదికలపై ఆసక్తిగా ఉన్నారని కథనాలొస్తున్నాయి.