Begin typing your search above and press return to search.

ఇక అంతా డిజిటల్ మయమే!

By:  Tupaki Desk   |   3 Nov 2018 5:49 AM GMT
ఇక అంతా డిజిటల్ మయమే!
X
టెక్నాలజి పుణ్యమా అని వినోదం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంటర్ టైన్మెంట్ అంటే కేవలం థియేటర్-టీవీ అనే మాటలకు కాలం చెల్లింది. 4జి విప్లవంతో సామాన్యుడు సైతం ఆన్ లైన్ మహత్యాన్ని ఒడిసిపట్టుకుంటున్న తరుణంలో దీని ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతూ పోతోంది. అమెజాన్-నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఎంత భారీ పెట్టుబడులు అవసరమైనా సరే పెట్టడానికి ముందుకు రావడాన్ని దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. దానికి తోడు అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే ప్రాచుర్యం ఉన్న వెబ్ సిరీస్ లకు క్రమంగా ఇండియాలో డిమాండ్ పెరుగుతోంది. దానికి బలం చేకూర్చేలా ట్రెండ్ కూడా అదే సూచిస్తోంది.

ఇప్పటికే హిందీలో సెక్రెడ్ గేమ్స్ సంచలన విజయం సాధించగా సన్నీ లియోన్ బయో పిక్ కూడా బ్రహ్మాండమైన స్పందన దక్కించుకుంది. పరిమిత టైం అంటూ లేకపోవడం ఎప్పుడు కావాలంటే అప్పుడే వీక్షించే వీలుండటం యాడ్స్ గోల లేకుండా 4కె క్లారిటీతో చూసే అవకాశం కలగడం తదితర కారణాలు ప్రేక్షకులను వెబ్ సిరీస్ లవైపు మళ్లిస్తున్నాయి. నిజానికి వెబ్ సిరీస్ ల కాన్సెప్ట్ టీవీలో వచ్చే సీరియల్స్ లాగే ఉంటుంది. కాకపోతే ప్రధాన వ్యత్యాసం వీటిలో సాగతీత ఉండదు. క్రియేటివిటీకి పెద్ద పీఠ వేస్తారు. సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సైతం ఆరేడు గంటల పాటు ఉండే సీజన్స్ లో నటిస్తున్నారు అంటేనే ఇవి ఎంత బాగా రీచ్ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

తెలుగులో సైతం ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. ఇప్పటికే జగపతి బాబు-వరుణ్ సందేశ్-సుమంత్ అశ్విన్-రానా- నవదీప్- హరితేజ లాంటి వాళ్ళు కొన్నింటిలో నటించారు కూడా. మంచి కాన్సెప్ట్ తో ఎంగేజ్ చేసేలా ఉంటే 2 కోట్ల దాకా ఒక్కో సీజన్ కు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్-నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సిద్ధంగా ఉన్నాయట. సరైన అప్రోచ్ తో వెళ్తే ఇందులో కూడా మంచి భవిష్యత్తు ఉందని పరిశీలకుల మాట. టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సినిమా ఒకటే వేదిక కాదని ఇలాంటి వెబ్ సిరీస్ లు ఫ్యూచర్ లో రాజ్యమేలబోతున్నాయి కాబట్టి పరిశ్రమలోకి రావాలని కలలు కంటున్న యువతరం వీటి వైపు ఓసారి దృష్టి సారిస్తే బెటరేమో