Begin typing your search above and press return to search.

ఆఫర్స్ కోసం దేనికైనా రెడీ అంటున్న హీరోయిన్స్...!

By:  Tupaki Desk   |   15 July 2020 4:30 PM GMT
ఆఫర్స్ కోసం దేనికైనా రెడీ అంటున్న హీరోయిన్స్...!
X
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన వారు కూడా ఏదొక రోజు ఫేడ్ ఔట్ దశకు చేరుకోవాల్సిందే. అందులోనూ మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి హీరోయిన్స్ కి దక్కిన క్రేజ్ ఉండేది కొంత కాలమే అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ క్రమంలో రోజుకో కొత్త హీరోయిన్ ఇండస్ట్రీలో అడుగు పెడుతూనే ఉంటుంది. కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకు పోవాల్సిందే అనే సామెత సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ విషయంలో కరెక్ట్ గా సరిపోతుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు గా వెలుగొంది తమ అందంతో కుర్రకారును కట్టిపడేసిన బ్యూటీస్ కి ఇప్పుడు అనుకోని కష్టాలు వచ్చి పడ్డాయి. అప్పట్లో వరుస అవకాశాలతో తమ హవా చూపించిన హీరోయిన్లు ఇప్పుడు ఆఫర్లు లేక అవస్థలు పడుతున్నారట. దీంతో చేసేదేమి లేక సోషల్ మీడియానే సాధనంగా వాడుకుంటున్నారు. ఫోటోషూట్స్ చేస్తూ తమ అంద చందాలను బయట పెడుతూ నెటిజన్లకు మత్తెక్కిస్తున్నారు. అలా అయినా దర్శక నిర్మాతలు చూపు తమ వైపు తిప్పుకోడానికి ట్రై చేస్తూనే ఉన్నారు.

అయితే ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పుణ్యమా అని అలాంటి హీరోయిన్స్ మళ్ళీ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఒరిజినల్ మూవీస్ కి ఆదరణ లభిస్తుండటంతో ఈ భామలు అటు వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో కొన్ని హద్దులు పెట్టుకొని యాక్ట్ చేసిన వారు కూడా వెబ్ సిరీస్ లలో ఛాన్సెస్ కోసం గ్లామర్ డోర్స్ తెరిచేస్తున్నారు. వెబ్ సిరీస్ లో రొమాంటిక్ పాత్రలో నటించడానికి.. అస్లీల సన్నివేశాలలో నటించడానికి కూడా వెనుకాడటం లేదు. క్రైమ్ థ్రిల్లర్ హార్రర్ అడల్ట్ అనే తారతమ్యాలు లేకుండా నటించేస్తున్నారు. వెబ్ వరల్డ్ లో నిరూపించుకోడానికి దేనికైనా సిద్ధపడుతున్నారు. మొత్తం మీద సినిమా ఛాన్సెస్ లేని హీరోయిన్స్ కి వెబ్ సిరీస్ లు వరంగా మారుతున్నాయని చెప్పవచ్చు.