Begin typing your search above and press return to search.

కత్రినా ఎక్స్.. పెళ్లి చేసుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   11 May 2017 5:46 PM IST
కత్రినా ఎక్స్.. పెళ్లి చేసుకుంటున్నాడు
X
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ ఎఫైర్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హీరోగా ఇంకా నిలదొక్కుకోక ముందే హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టేశాడు ఈ హ్యాండ్సమ్ హీరో. మొదట్లో దీపికా పదుకొనేతో అతడికి సీరియస్ రిలేషన్ షిప్పే ఉండేది. కానీ తర్వాత ఇద్దరూ విడిపోయారు. మధ్యలో ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో కలిపి అతడి పేరు నానింది. చివరగా కత్రినా కైఫ్ దగ్గరికి వచ్చాక రణబీర్ కు బ్రేకులు పడ్డట్లే కనిపించింది. ఇద్దరూ మూణ్నాలుగేళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇక ఇద్దరికీ పెళ్లే తరువాయి అని ప్రచారం జరిగింది. కొన్నాళ్ల పాటు రణబీర్ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే మెలిగింది కత్రినా.

ఐతే అంత గాఢమైన బంధం కూడా నిలవలేదు. కత్రినాకు టాటా చెప్పేసి కొత్త జీవితం మొదలుపెట్టాడు రణబీర్. ఐతే ఇప్పటికే అతడికి 34 ఏళ్ల వయసు వచ్చేయడంతో ఇక పెళ్లి చేసేయాలని తొందరపడుతోంది కపూర్ కుటుంబం. ఇటీవలే లండన్లో పర్యటించిన రిషి కపూర్ ఫ్యామిలీ.. అక్కడ రణబీర్ కు రెండు మూడు పెళ్లిచూపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అందులో ఒకరిని ఫైనల్ చేసి ఈ ఏడాదే పెళ్లి కూడా చేసేయాలని చూస్తున్నారు. ఒక మ్యాచ్ దాదాపుగా ఖాయం అయినట్లు కూడా చెబుతున్నారు. మరి తాను ఎంతగానే ప్రేమించిన రణబీర్ కు పెళ్లయిపోతుంటే కత్రినా తట్టుకుని ఎలా నిలబడుతుందో చూడాలి. పెళ్లికి ఆమె రెడీగానే ఉన్నా.. రణబీరే నో చెప్పి ఆమె నుంచి దూరం జరిగినట్లుగా వార్తలొచ్చాయి ఇంతకుముందు. మరి కత్రినా సింగిల్ గా ఉండగానే.. రణబీర్ పెళ్లి చేసుకుంటాడా?