Begin typing your search above and press return to search.
మహమ్మారీ టైమ్ లో పెళ్లి.. ఇప్పుడు రిసెప్షన్లు!!
By: Tupaki Desk | 5 Oct 2022 3:34 AM GMTస్టార్ కపుల్స్ ప్రేమాయణాలు రహస్య వివాహాలు ఎప్పుడూ అభిమానుల్లో హాట్ టాపిక్. అదే విధంగా రిచా చద్దా- అలీ ఫజల్ జంట నడుమ రిలేషన్ షిప్ డేటింగ్ గురించి చాలా ఏళ్లుగా పుకార్లు ఉన్నాయి. అయితే ఈ జంట మహమ్మారీ సమయంలో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. కానీ అప్పట్లో క్రైసిస్ కారణంగా విందు వినోద కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తాము పెళ్లి చేసుకున్న విషయాన్ని కూడా దాచకుండా వారు బహిరంగంగా వెల్లడించారు.
అయితే కరోనా క్రైసిస్ పూర్తిగా వైదొలగి ప్రజలు సురక్షితంగా ఉన్న ఈ సమయంలో తిరిగి వారి వివాహ వేడుకలను వైభవంగా జరుపుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఈ జంట పెళ్లి వేడుకలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే రెండున్నరేళ్ల క్రితమే చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఆ మేరకు వీరి పెళ్లిని అధికార ప్రతినిధి ధృవీకరించారు. ఇప్పుడు తమ స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం మాత్రమే మరోసారి పెళ్లి వేడుకను జరుపుకుంటున్నారు. వివాహ రిసెప్షన్లు పార్టీలను ఢిల్లీ - లక్నోలో నిర్వహించారు. ముంబైలో ఈరోజు రాత్రి ఫైనల్ ఈవెంట్ ని తమ పరిశ్రమ స్నేహితుల కోసం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు భారీగా తారలు తరలి రానున్నారు.
రిచా - అలీ గతంలో ఒక వాయిస్ నోట్ లో 'రెండేళ్ల క్రితం తమ కలయికకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువరించారు. కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకుంటున్నామని వెల్లడించారు. ఆ సమయంలోనే మహమ్మారి దేశంలో ప్రవేశించింది. మా పెళ్లి వేడుకలకు మహమ్మారీ పాజ్ బటన్ నొక్కింది. దేశంలోని మిగిలిన వారిలాగే మేము మేం కూడా వ్యక్తిగత విషాదాలను ఒకదాని తర్వాత ఒకటిగా ఎదుర్కొన్నాము. ఇప్పుడు మనమందరం రిలీఫ్ గా ప్రశాంతతను ఆస్వాధిస్తున్నప్పుడు బంధుమిత్రులు కుటుంబాలతో వేడుకలు జరుపుకుంటున్నాం. మాపై కురుస్తున్న ప్రేమకు ఆశీర్వాదాలకు చాలా సంతోషిస్తున్నాం. మేము మీకు మా ప్రేమ తప్ప మరేమీ అందించలేము. ధన్యవాదాలు.." అని వాయిస్ సందేశం అందించారు.
ఈ జంట పెళ్లి వేడుకలు రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అలీ - రిచా ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. రిచా కొన్ని బోల్డ్ క్యారెక్టర్లలో డ్యాషింగ్ ప్రదర్శనలతో బాలీవుడ్ లో పాపులారిటీని సంపాదించిన సంగతి తెలిసిందే.
మాయావతి బయోపిక్ లో రిచా మాలీవుడ్ శృంగార నాయిక షకీలా బయోపిక్ లో నటించి ప్రశంసలు దక్కించుకున్న రిచా చద్దా ఆ తర్వాత పాయల్ - అనురాగ్ బసు ఎపిసోడ్ లో వివాదాలతోనూ కావాల్సినంత ప్రచారం తెచ్చుకుంది. తదుపరి రిచా వివాదాస్పద ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిగా నటించింది. ఉత్తర ప్రదేశ్ లో రాజకీయంగా పెను మార్పు తెచ్చి.. అసమానతలను ధిక్కరించే రాజకీయ నాయకురాలిగా రిచా కనిపించింది. ఈ కథాంశం కల్పితమైనది అని చెబుతున్నా యుపి మాజీ ముఖ్యమంత్రి .. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి పాత్రనే ఇది అన్న చర్చా సాగింది.
తారా అనే మహిళ విచిత్రమైన పితృస్వామ్యం.. కుల అణచివేత.. క్రూరమైన హింసతో పాటు రాజకీయాల విద్రోహులతో పోరాడుతుంది. ఎదగండి.. ఎదిగితేనే మార్పు.. అని చెబుతుంది. ఆమె ఆత్మగౌరవంతో ధైర్యంతో పోరాటం సాగిస్తుంది. మేడమ్ ముఖ్యమంత్రికి జాలీ ఎల్‌ఎల్ బి ఫేమ్ సుభాష్ కపూర్ దర్శకత్వం వహించారు. 90 లలో సుభాష్ కపూర్ పొలిటికల్ జర్నలిస్టుగా పనిచేశారు. ఆ అనుభవం నుంచే ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం జనవరి 22 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.