Begin typing your search above and press return to search.

వీకెండ్ ఓటీటీ హంగామా.. సినీ లవర్స్ కి పండుగే..!

By:  Tupaki Desk   |   17 Nov 2022 11:50 AM GMT
వీకెండ్ ఓటీటీ హంగామా.. సినీ లవర్స్ కి పండుగే..!
X
ఇదివరకు వీకెండ్ వస్తే థియేటర్ లో ఏ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసే వారు కానీ ఇప్పుడు కాలం మారింది. వీకెండ్ వస్తుంది అంటే థియేటర్ లో సందడి చేసే సినిమాలతో పాటుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల గురించి ఆసక్తి చూపిస్తున్నారు.

కొద్దిరోజులుగా ఓటీటీ లో సినిమాల సందడి తగ్గింది. అయితే ఈ వీకెండ్ మాత్రం ఓటీటీ ఆడియన్స్ కు ఫుల్ జోష్ తెప్పించేలా సినిమాలు వస్తున్నాయి. తెలుగుతో పాటుగా హాలీవుడ్ సీరీస్ లు కూడా ఈ వారాంతం ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి.

ఇక ఈ లిస్ట్ లో మొదటగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా వస్తుంది. మళయాళ మూవీ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా 19 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రీసెంట్ సూపర్ హిట్ మూవీ కార్తి సర్ధార్ కూడా ఓటీటీ రిలీజ్ అవుతుంది. నవంబర్ 18న ఈ మూవీ ఆహా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ లవర్స్ ఈగర్ గా ఉన్నారు.

వీటితో పాటుగా రాజ్ తరుణ్ అహ నా పెళ్లంట వెబ్ సీరీస్ జీ 5లో గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. డిస్నీ హాట్ స్టార్ లో సీతారామం హిందీ వర్షన్ నవంబర్ 18న స్ట్రీమింగ్ అవుతుంది. వీటితో పాటుగా నెట్ ఫ్లిక్స్ లో ది వండర్ బుధవారం నుంచి.. 1899 మూవీ గురువారం నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇవే కాదు రిటర్న్ టు క్రిస్మస్ క్రీక్, ఇలైట్, స్లంబర్ ల్యాండ్, ఇన్ సైడ్ జాబ్, రెజీన్ సుప్రీం రీజన్ 1 లాంటి హాలీవుడ్ సినిమాలన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాయి.

హస్టల్ డేస్ 3 అనే హిందీ వెబ్ సీరీస్, ది సెక్స్ లైఫ్ ఆఫ్ కాలేజ్ గర్ల్స్ అనే వెబ్ సీరీస్ కూడా అమేజాన్ ప్రైం లో రిలీజ్ అయ్యాయి. జీ 5 లో కంట్రీ మాఫియా సోనీ లివ్ లో అనల్ మీలే పని తులి తమిళం, వండర్ ఉమెన్ తెలుగు సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. సినీ లవర్స్ అందరికి తమకు నచ్చిన జోనర్ సినిమాలను చూసేందుకు ఈ వీకెండ్ ఫుల్ మూవీ ధమాకా ఉండబోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.