Begin typing your search above and press return to search.

రామ‌రాజు .. రామ‌మ్ రాఘ‌వ‌మ్ వ‌చ్చేస్తోంది

By:  Tupaki Desk   |   31 Dec 2021 1:30 PM GMT
రామ‌రాజు .. రామ‌మ్ రాఘ‌వ‌మ్ వ‌చ్చేస్తోంది
X
రాజ‌మౌళి అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన పాన్ ఇండియన్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ప్రెస్టీజియ‌స్ ఫిల్మ్ గా మారిన ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామారాజు గానూ, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం గానూ న‌టించిన విష‌యం తెలిసిందే. ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేప‌థ్యంలో ఓ ఫిక్ష‌న‌ల్ స్టోరీని మ‌రింత ప్ర‌భావ‌వంతంగా తీర్చి దిద్ది ఇండియ‌న్ తెర‌పై ఓ అద్భుతాన్ని `ఆర్ ఆర్ ఆర్‌`తో ప్ర‌పంచానికి చూపించ‌బోతున్నారు.

ఇప్ప‌టికే విరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెల‌కొన్న ఈ మూవీని జ‌న‌వ‌రి 7న 14 భాష‌ల్లో అత్యంత భారీ స్థాయిలో రీలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించిన రాజ‌మౌళి రిలీజ్ మ‌రో ఏడు రోజులు వున్న నేప‌థ్యంలో మ‌రింత స్పీడు పెంచారు. ఇటీవ‌ల ముంబైలో ప్రచార ప‌ర్వాన్ని హోరెత్తించిన రాజ‌మౌళి త‌న ఫోక‌స్ ని ద‌క్షిణాదికి మార్చేశారు. నిన్న‌టి వ‌ర‌కు త‌మిళ ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం చేసిన జ‌క్క‌న్న ఇక తెలుగులో ప్రమోష‌న్స్ ని స్పీడ‌ప్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా రామ్ చ‌ర‌ణ్ పై చిత్రీక‌రించిన `రామ‌మ్ రాఘ‌వ‌మ్` అంటూ సాగే పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్నారు. సంస్కృతంలో సాగే ఈ ట్రాక్ కు ఎం.ఎం. కీర‌వాణి సంగీతం అందించ‌గా సాహిత్యాన్ని ఆయ‌న సోద‌రుడు శివ‌శ‌క్తి ద‌త్తా అందించారు. భావోద్వేగ‌భ‌రితంఆ సాగే ఈ పాట‌ని విజ‌య్ ప్ర‌కాష్, చంద‌న బాల క‌ల్యాణ్‌, చారు హ‌రిహ‌ర‌న్ అండ్ కోర‌స్ ఆల‌పించారు.

ఈ సాంగ్ కి సంబంధించిన లిరిక‌ల్ ప్రోమోలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు గెట‌ప్ లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందుకు సంబంధించిన స్టిల్ ని మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. భార‌తీయ తెర‌పై మునుపెన్న‌డూ చూడ‌ని బిగ్గెస్ట్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ కోసం అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో టిక్కెట్ అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్టాయిలో జ‌రిగి సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

ఇటీవ‌ల చిత్ర బృంద ఎన్టీఆర్ పాత్ర‌కు సంబంధించిన `కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగ‌డోలే మండాలి కొడుకో మండాలి కొడుకో.. అంటూ సాగే వీడియోని విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ పాట‌ని సుద్దాల అశోక్ తేజ రాయ‌గా.. కీర‌వాణి స్వ‌రాలు అందించారు. కాల‌భైర‌వ ఆల‌పించారు. ఈ పాట త‌ర‌హాలోనే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించిన `రామ‌మ్ రాఘ‌వ‌మ్.. ` అంటూ సాగే గీతాన్ని ఈ రోజు రాత్రి 9 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నారు. సినిమాలో ఈ పాట రోమాంచితంగా వుండేలా క‌నిపిస్తోంది.

భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ న‌టించారు. అజ‌య్ దేవ‌గ‌న్‌, రేస్టీవెన్ స‌న్, అలీస‌న్ డూడీ, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.