Begin typing your search above and press return to search.
రానాను వాడుకోవడం రాలేదే
By: Tupaki Desk | 23 Jan 2018 7:37 AM GMTబాహుబలి తర్వాత ప్రభాస్ తో పాటు భల్లాలదేవా రానాకు కూడా బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఘాజీ కూడా సక్సెస్ సాధించడంతో ఆజానుబాహుడైన రానాను అక్కడి ప్రేక్షకులు కూడా బాగానే ఒన్ చేసుకున్నారు. బాహుబలి విడుదల చేసినప్పటి నుంచి కరణ్ జోహార్ ఆ టీంలో ప్రతి ఒక్కరితో మంచి ఫ్రెండ్ షిప్ మైంటైన్ చేస్తున్నాడు. రానా, ప్రభాస్ లతో ఇంకాస్త ఎక్కువగా. అందుకే కరణ్ జోహార్ తాను పూర్తి స్థాయి నటుడిగా కనిపించబోయే కొత్త సినిమా వెల్కం టు న్యూ యార్క్ లో రానాకు కూడా ఒక పాత్ర ఇచ్చాడు అనగానే అది చాలా కీలకమైనదేమో అన్న అంచనాలు మొదలయ్యాయి. కాని ఈ రోజు విడుదలైన ట్రైలర్ చూస్తే మాత్రం రానా ఫాన్స్ కొంత నిరాశ పడక తప్పదు. ఎందుకంటే ట్రైలర్ లో తను కనిపించేది కేవలం రెండు మూడు సింగల్ షాట్స్ లో మాత్రమే.
వెల్కమ్ టు న్యూ యార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. దిల్జిత్ దోషన్జ్, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న ఈ మూవీలో కరణ్ జోహార్ మొదటి సారి కామెడీ విలన్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పూర్తి నిడివి ఉన్న పాత్ర పోషిస్తున్నాడు. బోమన్ ఇరాని, ధోని ఫేం సుశాంత్ రాజ్ పుత్ - రితిష్ దేశ్ ముఖ్ - లారా దత్తా ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఇక్కడి నుంచి న్యూ యార్క్ వెళ్ళిన పంజాబీ హీరో మధ్యలో ఫాషన్ డిజైనర్ అయిన హీరొయిన్ ని కలుసుకోవడం, ఇద్దరు కలిసి అక్కడికి చేరుకున్నాక సినిమా పిచ్చి ఉన్న మాఫియా డాన్ కరణ్ జోహార్ కామెడీతో కథను మలుపు తిప్పడం అంతా ఓ మోస్తరుగా గతంలో చూసిన చాలా హిందీ సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది.
దీనికి దర్శకుడు చక్రి తోలేటి. ఇతను మన తెలుగువాడే. గతంలో వెంకటేష్-కమల్ కాంబో లో వచ్చిన ఈనాడుతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అజిత్ తో బిల్లా 2 తీసాడు కాని అది ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం తమన్నా, నయనతారలతో చెరో సినిమా సెట్స్ మీద ఉన్న చక్రి తోలేటి తొలి బాలీవుడ్ మూవీ ఇది. ఫుల్ కామెడీ మూవీగా వెల్కం టు న్యూ యార్క్ మీద మంచి అంచనాలే ఉన్నాయి.