Begin typing your search above and press return to search.
అమెరికా కోడలు ఓటీటీ కలలు సక్సెసయ్యేనా?
By: Tupaki Desk | 15 Aug 2020 5:00 AM GMTఅమెరికన్ గాయకుడు కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడాక ప్రియాంక చోప్రా కెరీర్ పరంగా మరింత స్పీడ్ పెంచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీ అవుతున్న పీసీ అక్కడ ఓటీటీ నిర్మాతగానూ కొత్త అవతారం ఎత్తింది. ప్రియాంక చోప్రా నిర్మించిన `ఈవిల్ ఐ` OTT వేదికపై విడుదలకు సిద్ధంగా ఉంది. వెల్ కమ్ టు ది బ్లమ్ హౌస్ సిరీస్ లో ఎనిమిది స్పైన్ చిల్లింగ్ ఇంటర్ లింక్డ్ చిత్రాలలో ఒకటి గా `ఈవిల్ ఐ` ఓటీటీ అభిమానులకు ట్రీటివ్వబోతోంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ను బ్లమ్‌హౌస్ టెలివిజన్ - అమెజాన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రియాంక చోప్రా ఈ సిరీస్ కి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కొనసాగుతోంది.
కుటుంబంలో కల్లోలం.. లైంగిక సంబంధాల నేపథ్యంలో.. విధ్వంసకర ఇతివత్తంతో ఈ సిరీస్ తెరకెక్కింది. ఆద్యంతం థ్రిల్ భయాన్ని కలిగిస్తుందిట. ది లై- బ్లాక్ బాక్స్ - ఈవిల్ ఐ- నో యూటర్న్ ఇలా పలు ఎపిసోడ్లతో అక్టోబర్ ని ఈ సిరీస్ రక్తి కట్టించనుంది. వీటికి జు క్విర్కే దర్శకత్వం వహించారు. 2021లోనూ కొన్ని ఎపిసోడ్లను లాంచ్ చేయనున్నారు.
నాటక రచయిత మాధురి శేకర్ అవార్డు విన్నింగ్ రచన ఆధారంగా `ఈవిల్ ఐ` కి ఎలన్ దస్సాని- రాజీవ్ దస్సాని జోడీ దర్శకత్వం వహించారు. ఇందులో సరితా చౌదరి- సునీతా మణి- ఒమర్ మస్కటి- బెర్నార్డ్ వైట్ నటించారు. కుటుంబ బంధాల నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే థ్రిల్లర్ కాన్సెప్టు తో ఈ సిరీస్ తెరకెక్కింది. ఇక పలు ఎపిసోడ్లకు వేరే వేరే దర్శకులు పని చేశారు.