Begin typing your search above and press return to search.
వెల్ కమ్ టు ది కింగ్ ఆఫ్ అండర్ వరల్డ్
By: Tupaki Desk | 3 Feb 2022 10:30 AM GMTతమిళ స్టార్ హీరో శింబు ఇటీవలే మానాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్నాడు. కమర్షియల్ గా మంచి సక్సెస్ అయిన మానాడు ప్రస్తుతం ఓటీటీ లో కూడా మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఈ సమయంలో శింబు చేస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నేడు శింబు పుట్టిన రోజు కావడంతో ప్రస్తుతం ఆయన నటిస్తున్న పాతు తలా సినిమా గ్లిమ్స్ ను విడుదల చేశారు. వెల్ కమ్ టు ది కింగ్ ఆఫ్ అండర్ వరల్డ్ అంటూ స్టూడియో గ్రీన్ సంస్థ ఈ వీడియోను విడుదల చేసింది. శింబు అభిమానులకు ఒక మంచి పుట్టిన రోజు కానుక అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
పాతు తాలా చిత్రంలో శింబుతో పాటు గౌతమ్ కార్తీక్.. గౌతమ్ వాసు దేవ్ మీనన్.. కళైయరసన్ మరియు ప్రియా భవాని శంకర్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కు ఓబెలి ఎన్ కృష్ణ దర్శకత్వం వహించాడు. కే ఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమా ను స్టూడియో గ్రీన్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. శింబు సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. తాజాగా విడుదల అయిన ఈ గ్లిమ్స్ తో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ఏమాత్రం తగ్గకుండా సినిమా ను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదే ఏడాది ద్వి తీయార్థం లో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. అండర్ వరల్డ్ డాన్ పాత్రలో శింబు కనిపించబోతున్న నేపథ్యంలో ఆయన పాత్ర గురించి తమిళ మీడియాలో కథలు కథలుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన పాత్ర నెగటివ్ షేడ్స్ ఉంటుందని అంతా భావించారు. కాని గ్లిమ్స్ చూస్తుంటే అండర్ వరల్డ్ డాన్ అయ్యి ఉంటాడు కాని ప్రజల కోసం మంచి చేసే మంచి వ్యక్తిగా డాన్ గా శింబు కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది. సినిమా విడుదల అయితే కాని శింబు పాత్ర ఏంటీ అనేది మరింత స్పష్టంగా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కనుక అప్పటి వరకు ఈ సస్పెన్స్ తప్పదు.