Begin typing your search above and press return to search.

అయ్యయ్యో.... మరీ ఇంత సిగ్గు ఏంటి ఆసి బాబు!

By:  Tupaki Desk   |   3 Sep 2022 12:30 PM GMT
అయ్యయ్యో.... మరీ ఇంత సిగ్గు ఏంటి ఆసి బాబు!
X
మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది ఇప్పటికే హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. ముందు ముందు కూడా చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటే మినిమం గా అంచనాలు ఉంటాయి. కనుక ఆ అంచనాలను రీచ్ అవ్వడానికి హీరోలు గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.

ఆ గ్రౌండ్‌ వర్క్ లో భాగంగా నటన లో శిక్షణ తీసుకోవడంతో పాటు డాన్స్ లో మంచి ప్రావిణ్యంను సాధించాల్సిన అవసరం ఉంది. మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ హీరోల యొక్క మాస్ డాన్స్‌ లను ఇష్టపడుతారు. మాస్ లో మంచి ఫాలోయింగ్‌ సాధించాలంటే కచ్చితంగా మాస్ స్టెప్పులు వేయాల్సిందే.

ప్రస్తుతం యంగ్‌ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ కి మంచి ఫాలోయింగ్‌ ఉంది అంటే అది ఖచ్చితంగా వారి యొక్క డాన్స్ ప్రతిభ అనడంలో సందేహం లేదు. కొందరు డాన్స్ సరిగా వేయలేని హీరోలను యాంటీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సొంత ఫ్యాన్స్ కూడా అప్పుడప్పుడు ట్రోల్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ట్రోల్స్ ను వైష్ణవ్‌ తేజ్ ఎదుర్కోవాల్సి వస్తుందని టాక్‌ వినిపిస్తుంది.

వైష్ణవ్‌ తేజ్ మొదటి సినిమా నుండి నిన్న వచ్చిన మూడవ సినిమా రంగ రంగ వైభవంగా వరకు ఏ సినిమాలో కూడా చూడ్డానికి ఒక మాంచి మాస్ బిట్‌ సాంగ్‌ కు డాన్స్ చేయలేదు. సాధ్యం అయినంత వరకు మ్యానేజ్ చేస్తూ వచ్చాడు. రంగ రంగ వైభవంగా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం కనుక కనుక ఒక మోస్తరు డాన్స్ అయినా ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు.

వైష్ణవ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఒక మంచి మాస్ బీట్‌ ను దేవి శ్రీ ప్రసాద్‌ రెడీ చేశాడట. కానీ ఆ పాటను తీసేసే వరకు వైష్ణవ్ ఊరుకోలేదట. తన వల్ల డాన్స్ చేయడం కాదని తేల్చి చెప్పాడట. డాన్స్ చేయడం అంటే తనకు సిగ్గు అని.. తాను మంచి డాన్సర్ ని కాదని ముందుగానే యూనిట్‌ సభ్యులకు చెప్పేశాడట. దాంతో దర్శకుడు అలాంటి మాస్ ఆలోచన ను చేయలేదు.

మరీ ఇంత సిగ్గు అయితే ఎలా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఉప్పెన సినిమాలో ఆసి గా బేబమ్మ తో రొమాన్స్ చేసిన దానికంటే ఇదేమైనా ఎక్కువనా అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే మరి కొందరు మాత్రం మాస్ కి దగ్గర అవ్వాలంటే మాస్ స్టెప్పులు కావాల్సిందే అంటున్నారు. మరి వైష్ణవ్ తేజ్ తన సిగ్గును పక్కన పెట్టి తదుపరి సినిమా లో అయినా డాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తాడో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.