Begin typing your search above and press return to search.
మహర్షి రేంజ్ ఎంత ?
By: Tupaki Desk | 4 May 2019 7:59 AM GMTలాంగ్ వీక్ ఎండ్ ని టార్గెట్ పెట్టుకుని వస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు మహర్షి మీద అంచనాలు ఎలా ఉన్నాయో మాటల్లో చెప్పడం కష్టం. సంక్రాంతి తర్వాత స్టార్ హీరోల సినిమా ఏది బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయలేదు. దానికి తోడు ప్రిన్స్ మూవీ వచ్చి ఏడాది దాటేసింది. ఇవన్ని కూడబలుక్కుని అంచనాల భారాన్ని అమాంతం పెంచేశాయి. ఇప్పుడు అందరి చూపు రికార్డుల వైపే ఉంది.
నాన్ బాహుబలి లెక్కలన్నీ ఖైది నెంబర్ 150 రంగస్థలం ఖాతాలో ఉన్న నేపధ్యంలో అవి మహర్షి దాటాలనే ప్రిన్స్ ఫాన్స్ లక్ష్యం. గత ఏడాది భరత్ అనే నేను ఆ పని చేసేలా కనిపించినా రెండు మూడు వారాలు దాటగానే అనూహ్యంగా స్లో అయిపోయింది. దీంతో కొన్ని చోట్ల చిన్నా చితకా నష్టాలు తప్పలేదు. కాని మహర్షి విషయంలో అవేవి రిపీట్ కాకూడదు అనేదే అందరూ ఎదురు చూస్తున్నది
ఈ నేపధ్యంలో మహర్షి ముందు ఇవన్ని సవాళ్లుగానే చెప్పుకోవాలి. ఓపెనింగ్స్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేకపోయినా ఆపై ఎన్ని రోజులు ఉధృతమైన వసూళ్ళను రాబడుతుంది అనే దాన్ని బట్టి నాన్ బాహుబలి రికార్డులు సొంతమవుతయా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. వంద కోట్ల షేర్ దాటితేనే మహర్షి అంచనాలు నిలబెట్టుకున్నట్టు అవుతుంది.
అయితే ఎంత మహేష్ మూవీ అయినా అదంతా ఈజీ కాదు. కాంపిటీషన్ లేకపోవడం అవెంజర్స్ దూకుడు దాదాపు తగ్గిపోవడం మహర్షికి కలిసి వచ్చే అంశాలు. కంటెంట్ బాగుంటే ఇదేమి పెద్ద మ్యాటర్ కాదు కాని ప్రీ రిలీజ్ కు ముందు కొంచెం వీక్ గా అనిపించిన ఆడియో టీజర్ ట్రైలర్ల టాక్ ను దాటుకుని మహర్షి గెలవాల్సి ఉంటుంది. అదే జరిగితే ఈ సమ్మర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మహేష్ జేబులో పడ్డట్టే