Begin typing your search above and press return to search.

బాబీ సింహా వ‌సంత కోకిల ప‌రిస్థితేంటీ?

By:  Tupaki Desk   |   11 Feb 2023 1:00 PM GMT
బాబీ సింహా వ‌సంత కోకిల ప‌రిస్థితేంటీ?
X
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు, హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌తో రూపొందిన కోలీవుడ్ సినిమాలకు తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టం తెలిసిందే. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లుగా వున్న వారు ఈ త‌ర‌హా సినిమాల‌తో హీరోలుగా మంచి గుర్తింపుని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో మ‌రిన్ని అవ‌కాశాల్ని సొంతం చేసుకున్నారు... హీరోలుగా, కీల‌క క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. గ‌త కొన్నేళ్ల క్రితం 'పిజ్జా' సినిమాతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విజ‌య్ సేతుప‌తి ఆ మూవీ ద్వారా రెండు భాష‌ల్లోనూ మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు.

ఆ రోజు నుంచి విభిన్న‌మైన సినిమాల్లో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. త‌న త‌ర‌హాలోనే టాలెంటెడ్ యాక్ట‌ర్ గా గుర్తింపుని సొంతం చేసుకున్న బాబీ సింహా హీరోగానూ రాణించాల‌నుకుంటున్నాడు. జిగ‌ర్తాండ సినిమాతో న‌టుడుగా ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న బాబీ సింహా తెలుగులోనూ డిస్కోరాజా, మ‌సాలా ప‌ద‌మ్‌, పంబు స‌ట్టై, రీసెంట్ గా 'వాల్తేరు వీర‌య్య‌' సినిమాల్లో న‌టించాడు.

తెలుగులోనూ మంచి అవ‌కాశాల్ని ద‌క్కించుకున్నా త‌న స్థాయి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం బాబి సింహాంకు రాక‌పోవ‌డంతో అత‌ని ప్ర‌తిభ తెలుగు ప్రేక్ష‌కుల‌కు పూర్తి స్థాయిలో తెలిసే అవ‌కాశం ద‌క్క‌లేదు. 'వాల్తేరు వీర‌య్య‌'లో న‌టించినా పూర్తి స్థాయి పాత్ర కాక‌పోయినా ఈ సినిమాతో తెలుగు లో బాబీ సింహా మంచి అవ‌కాశాల్ని ద‌క్కించుకోవ‌డం మొద‌లు పెట్టాడు. ఇదిలా వుంటే బాబీ సింహా హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ 'వ‌సంత కోకిల‌'. ర‌మ‌ణ‌న్ పురుషోత్త‌మ‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఈ శుక్ర‌వారం త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది.

క‌శ్మీర ప‌ర్దేశి హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని తెలుగులో రామ్ త‌ళ్లూరి రిలీజ్ చేశారు. ఇదొక హార‌ర్ థ్రిల్ల‌ర్‌. రొటీన్ లైఫ్, ఉద్యోగంతో విసిగిపోయిన ఓ యువ‌కుడు త‌న ప్రేయ‌సితో ఏకాంతంగా గ‌డ‌పాల‌ని బ‌య‌టికి వెళ‌తాడు. ఈ ప్ర‌యాణంలో అనివార్య కార‌ణాల వ‌ల్ల అడ‌విలో వ‌సంత కోకిల అనే హోట‌ల్ లో ఆగాల్సి వ‌స్తుంది. అక్క‌డ ఈ జంట‌కు అనూహ్య సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి?.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? వ‌ఈరి క‌థ ఎలా సుఖాంత‌మైంది అన్న‌దే అస‌లు క‌థ‌.

థ్రిల్ల‌ర్ సినిమాలు మినిమ‌మ్ గ్యారెంటీ అంటుంటారు. గ‌తంలో రూపొందిన థ్రిల్ల‌ర్ లు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బాక్సాఫీస్ వ‌ద్ద నెట్టుకొచ్చిన సంద‌ర్భాలు చాలానే వున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆ విష‌యంలో కాస్త త‌డ‌బ‌డిన‌ట్టుగా తెలుస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌కు ఇంట‌ర్వెల్ బ్యాంగ్ తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు కంటెంట్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం.. బ‌ల‌మైన కంటెంట్ లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల్ని పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. బాబీ సింహా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌.. విల‌న్‌. అలాంటి వ్య‌క్తి హీరోగా సినిమా అంటే ఏదో స్పెష‌ల్ వుంటేనే ప్రేక్ష‌కులు ఓన్ చేసుకుంటారు. అది ప‌క్క‌న పెట్టి రొటీన్ థ్రిల్ల‌ర్ స్టోరీతో హీరోగా ఆక‌ట్టుకోవాలంటే క‌ష్ట‌మే. 'వ‌సంత కోక‌ల‌' విష‌యంలోనూ ఇదే జ‌రిగింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.