Begin typing your search above and press return to search.
థియేటర్ల ఓపెనింగ్.. ఆ ప్రశ్నకు బదులేది??
By: Tupaki Desk | 31 May 2020 5:45 AM GMTసినీ పరిశ్రమ పెద్దలు షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించింది. షూటింగులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఆ నలుగురిలో ఒకరైన ప్రముఖ నిర్మాత.. ఆయన అనుచర వర్గాలు ఇండస్ట్రీని రీస్టార్ట్ చెయ్యడానికి సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారట. షూటింగులు మాత్రమే కాకుండా థియేటర్లను వీలైనంత త్వరగా రీ ఓపెన్ చేయించాలనేది వారి ప్రయత్నం.
ఎందుకంటే సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు ఓటీటీ ఆప్షన్ ఉన్నప్పటికీ.. థియేటర్లు ఓపెన్ చేస్తే కానీ వాళ్లకు ఆదాయం రాదు. పెద్ద సినిమాలకు పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలంటే థియేటర్లు ఓపెన్ చెయ్యడం అవసరం. పైగా ఎక్కువమంది నిర్మాతల చేతిలో వందల కొద్ది థియేటర్లు ఉన్నాయి. అవి ఎక్కువకాలం మూతపడి ఉంటే నష్టాలు మరింతగా పెరుగుతాయి. అందుకే ఈ నిర్మాతకు సంబంధించిన వారు థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నారట. అయితే వారు అడిగిన ఓ ప్రశ్నకు ఈ నిర్మాత టీమ్ దగ్గర సమాధానం లేదట.
మీరు థియేటర్లో సీట్స్ లో.. సిట్టింగ్ లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తే సరిపోతుందని అనుకుంటున్నారు కానీ ఇంటర్వెల్ లో టాయిలెట్లలో ఎలా సోషల్ డిస్టెన్స్ పాటిస్తారో చెప్పాలని ప్రశ్నించారట. పబ్లిక్ టాయిలెట్స్ ద్వారా మహమ్మారి త్వరగా వ్యాప్తి చెందుతుందని.. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో చెప్తే మేము త్వరగా థియేటర్లను ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇప్పిస్తాము అన్నారట. క్లిష్టమైన సమస్యే... క్యాంటీన్ లో భారీ రేట్ల కొరడాతో కొట్టించుకోకుండా ఆగగలరు కానీ టాయిలెట్ లో సూసూ పోసుకోకుండా ఎలా బిగబట్టుకోవాలబ్బా? ఈ లెక్కన ఒక్కో ఇంటర్వెల్ ఓ గంట ఇవ్వాలేమో!