Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న‌తో 10 మిలియ‌న్లు స‌రే కానీ మాయావితో?

By:  Tupaki Desk   |   2 Jun 2022 2:30 PM GMT
జ‌క్క‌న్న‌తో 10 మిలియ‌న్లు స‌రే కానీ మాయావితో?
X
రాజ‌మౌళి సినిమాలు త‌ప్ప ఇత‌ర ద‌ర్శ‌కుల సినిమాలు ఓవర్సీస్ మార్కెట్ నుంచి 5 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేయ‌గ‌ల‌వా? మారిన ట్రెండ్ లో పాన్ ఇండియా సినిమాల వెల్లువ‌లో ఇది పాజిబులేనా? అంటే .. సాధ్యం కానిది ఏదీ లేద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే అంత పెద్ద విజ‌యం ద‌క్కించుకోవాలంటే జ‌క్క‌న్న‌త‌ర‌హాలో లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌ను క్రియేట్ చేయాల్సి ఉంటుంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు.

ప్ర‌భాస్ త‌ర్వాత చ‌ర‌ణ్ - తార‌క్ ఆర్.ఆర్.ఆర్ తో అమెరికా మార్కెట్లో దుమ్ము దులిపారు. ఈ చిత్రం అమెరికా నుంచి 65కోట్లు (9.5 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేసింది. మ‌హేష్ ఇక‌పై జ‌క్క‌న్న‌తో క‌లిసి 10 మిలియ‌న్ డాల‌ర్ రేస్ లోకి చేర‌బోతున్నాడు. అయితే మ‌హేష్ కి ఇప్పుడు ఒక స‌మ‌స్య ఉంది. అత‌డు త‌దుప‌రి త్రివిక్ర‌మ్ తో చేస్తున్న సినిమా ఏ కేట‌గిరీకి చెందుతుంది? ఇది పాన్ ఇండియా రేంజేనా? అన్న‌ది స‌స్పెన్స్. అయితే మ‌హేష్ నిర్మాత‌లు మాత్రం అమెరికా నుంచి ఏకంగా ఐదు మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌ను తేవాల‌ని ల‌క్ష్యం పెట్టుకున్నార‌ట‌.

అంతేకాదు అమెరికా పంపిణీదారులు అవాక్క‌య్యేలా ఏకంగా 25కోట్ల మేర పంపిణీ హ‌క్కుల ధ‌ర‌ల్ని కోట్ చేసార‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఇంత పెద్ద మొత్తం రాబ‌ట్టాలంటే 4 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ నాన్ బాహుబ‌లి నాన్ ఆర్.ఆర్.ఆర్ కేట‌గిరీలో సినిమాలు 3.5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఈద‌గ‌లిగాయి. రంగస్థ‌లం - భ‌ర‌త్ అనే నేను చిత్రాల‌కు ఇంత పెద్ద వ‌సూళ్లు ద‌క్కాయి అప్ప‌ట్లో.

త్రివిక్రమ్ గత చిత్రం 'అల వైకుంఠపురంలో' ఉత్తర అమెరికాలో దాదాపు 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కానీ ఇప్పుడు మ‌హేష్ - త్రివిక్ర‌మ్ మ్యాజిక్ మ‌రోసారి వ‌ర్క‌వుటై ఐదు మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ సాధ్య‌మ‌వుతుందా? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ప్రముఖ అమెరికా డిస్ట్రిబ్యూటర్ దాదాపు రూ.20 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

అయితే నిర్మాతలు 25 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో మ‌హేష్ 28వ చిత్రం 5 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేస్తుందా? అన్న‌ది స‌స్పెన్స్. నిజానికి ప్రధాన ఆదాయం ఉత్తర అమెరికా నుండి రావాలి. అక్క‌డ అప్ప‌టి స‌న్నివేశాన్ని బ‌ట్టి ఏదైనా జ‌ర‌గొచ్చని కూడా విశ్లేషిస్తున్నారు.

జ‌క్క‌న్న‌తో మ‌హేష్ 10 మిలియ‌న్ డాల‌ర్లు ఓకే కానీ మాయావితో 5 మిలియ‌న్ డాల‌ర్లు ఓకేనా అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. త్రివిక్ర‌మ్ ఎంపిక చేసుకునే యూనిక్ కంటెంట్ క్యారెక్ట‌రైజేష‌న్ ప్ర‌తిదీ విదేశీ వ‌సూళ్ల‌కు చాలా కీల‌కం కానున్నాయి.