Begin typing your search above and press return to search.
అన్ లిమిటెడ్ విహార యాత్రలతో ఏం చెప్పదలిచారు?
By: Tupaki Desk | 28 Oct 2021 1:30 PM GMTఅక్కినేని నాగచైతన్య - సమంత జంట విడాకుల వ్యవహారం ఎంత హాట్ టాపిక్ అయ్యిందో ఇప్పుడు అంతకుమించి సమంత వినోద విహారయాత్రలు అభిమానుల్లో చర్చకు వస్తున్నాయి. గోవా ట్రిప్ మొదలు ఇటీవలి చార్ ధామ్ యాత్ర వరకూ ప్రతిదీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. అయితే ఈ ట్రిప్ లు ఇంతటితో ఆగినట్టు లేదు. సామ్ ప్రస్తుతం దుబాయ్ విహారయాత్రలో ఉన్నారు. అక్కడ బుర్జ్ ఖలీఫా సహా పలు అందమైన ప్రదేశాల్ని సందర్శిస్తున్నారు. ఆ మేరకు దుబాయ్ నుంచి ఒక్కో ఫోటోని షేర్ చేస్తూ తన యాత్రల స్వరూపాన్ని వెల్లడిస్తున్నారు.
సామ్ తో పాటు ఈ టూర్ లో తన స్టైలిస్ట్ లు ప్రీతం జుకల్కర్ - సాధనా సింగ్ ఉన్నారు. అసలు ఎలాంటి హింట్ లేకుండా తాను ఇలా వరుస విహార యాత్రలతో వేడి పెంచడంపై అభిమానుల్లో చర్చ సాగుతోంది. బుర్జ్ ఖలీఫా ఫోటోతో పాటు దుబాయ్ లో ఆహార వంటకాలను ఆస్వాధిస్తున్న వీడియోలను పోస్ట్ చేయగా వైరల్ గా మారాయి.
ఇక విహారయాత్రలతో పాటు అద్భుతమైన కొటేషన్లను షేర్ చేస్తూ సమంత అందరిలో స్ఫూర్తి నింపుతోంది. ఇటీవల సామ్ పేరెంట్ కి అవసరమయ్యే ఒక సూచనను కూడా చేశారు. ఆడపిల్లల్ని పెళ్లి చేసి పంపించేందుకు పొదుపు చేయడం కంటే వారి విద్య కోసం తల్లిదండ్రులు ఎలా ఖర్చు చేయాలి అనే ఆలోచనాత్మక పోస్ట్ ను పంచుకోగా వైరల్ అయ్యింది. సమంత ఏది షేర్ చేసినా ప్రస్తుతం సంఘంలో తన ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్త పడడం బయటపడింది. అన్నట్టు సామ్ లో మదనం ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదు. అందుకే ఇలా వరుస విహారయాత్రలతో అన్నిటినీ మరిచిపోయేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సినిమాలతో బిజీ అయితే అన్నిటి నుంచి బయటపడేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే తెలుగు-తమిళంలో అగ్ర బ్యానర్లతో సినిమాలకు సమంత సిద్ధమవుతోంది. వాటి రెగ్యులర్ చిత్రీకరణలకు కొంత సమయం పడుతుందని తన విహారయాత్రలు వెల్లడిస్తున్నాయి.