Begin typing your search above and press return to search.
అచలుడు వెనక అసలేం జరిగింది..?
By: Tupaki Desk | 6 Dec 2022 5:01 AM GMTకొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా అంటే మూవీ ఎనౌన్స్ మెంట్ రోజు నుంచే అంచనాలు భారీగా ఉంటాయి. అయితే ఆ అంచనాలను అందుకునేందుకు ఎంతో కష్టపడినా కొన్నిసార్లు ఫలితాలు తారుమారు అవుతుంటాయి. అయితే అలా ఎక్స్ పెక్టేషన్స్ కి రీచ్ అవ్వట్లేదు అని కొన్ని సినిమాలు మొదటి దశలోనే క్యాన్సిల్ చేసుకుంటారు. ప్రస్తుతం అలాంటి సీనే సూర్య బాల కాంబో సినిమాకు రిపీట్ అయ్యింది. బాల డైరెక్షన్ లో సూర్య హీరోగా సినిమా అనగానే తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా మరో శివపుత్రుడు లాంటి మూవీ వస్తుందని ఆశించారు.
వనన్ గాన్ తెలుగులో అచలుడు అంటూ టైటిల్ కూడా ఎనౌన్స్ చేశారు. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా నుంచి హీరో సూర్య తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే బాలాతో చర్చలు జరిపిన తర్వాతనే సూర్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సినిమా కొంత భాగం షూటింగ్ చేశాక ఈ కథ సూర్యకు సెట్ అవ్వదని.. తమ్ముడు సూర్య తప్పుక్కున్నట్టు చెప్పాడు బాల. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే కథ బాగున్నా అనుకున్న విధంగా అవుట్ పుట్ రాకపోవడంతో సూర్య ఆ ప్రాజెక్టు నుంచి క్విట్ అయ్యాడని కోలీవుడ్ టాక్.
ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను అందించిన బాల ఈమధ్య అసలు ఏమాత్రం ఫాం లో లేడు. తెలుగు సినిమా అర్జున్ రెడ్డి రీమేక్ ని కూడా అలానే చేశాడు. విక్రం తనయుడు ధ్రువ్ విక్రం తో బాల చేసిన వర్మ మూవీ మొత్తం ఎడిటింగ్ టేబుల్ మీదే ఆగిపోయింది.
సినిమాను బాలా తనదైన స్టైల్ లో తీయగా అది రొటీన్ సినిమాగా వచ్చింది. రిలీజ్ చేసిన టీజర్ కి కూడా విమర్శలు రావడంతో మేకర్స్ దాన్ని అలా వదిలి పెట్టారు. బాల కి అది పెద్ద షాక్. అయితే ఇప్పుడు సూర్య అచలుడు విషయంలో కూడా అదే రిపీట్ అయ్యింది.
ఒకప్పటిలా కాంబినేషన్స్ తో హిట్ అయ్యే రోజులు కావివి. ఎంత పెద్ద కాంబో అయినా సినిమాలో కంటెంట్ లేకపోతే లైట్ తీసుకుంటున్నారు ఆడియన్స్. అదీగాక మిగతా స్టార్స్ అంతా పాన్ ఇండియా మార్కెట్ కి దూసుకెళ్తుంటే సూర్య కూడా మొహమాటాలని వదిలి పెట్టి కంటెంట్ ఉన్న సినిమాలనే చేయాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాల తో అచలుడు సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
వనన్ గాన్ సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు కానీ ఆ ప్రాజెక్ట్ మాత్రం ఉంటుందని అంటున్నారు డైరెక్టర్ బాల. ఆ సినిమాలో మరో హీరో నటిస్తారని.. అది ఎవరన్నది త్వరలో ప్రకటిస్తామని అన్నారు. విక్రం సినిమాలో రోలెక్స్ పాత్రలో మెప్పించిన సూర్య ఆ తరహాలో అచలుడుతో అలరిస్తాడని అనుకుంటే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు సూర్య. నేషనల్ అవార్డ్ విన్నర్ కాబట్టి కథల విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారట సూర్య.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.