Begin typing your search above and press return to search.

జాఫర్‌ ఎలిమినేషన్‌ పై ఉన్న అనుమానాలేంటీ?

By:  Tupaki Desk   |   5 Aug 2019 9:24 AM GMT
జాఫర్‌ ఎలిమినేషన్‌ పై ఉన్న అనుమానాలేంటీ?
X
బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 రెండు వారాలను పూర్తి చేసుకుని మూడవ వారంలోకి ఎంటర్‌ అయ్యింది. రెండవ వారంలో బిగ్‌ బాస్‌ నుండి జాఫర్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. మొదటి వారంలో కూడా నామినేషన్‌ లో ఉన్న జాఫర్‌ కు ఓట్లు బాగానే పడటంతో హేమ ఔట్‌ అయ్యి జాఫర్‌ ఉన్నారు. అయితే రెండవ వారంలో మాత్రం ప్రేక్షకులు జాఫర్‌ కు తక్కువ ఓట్లు వేశారు అంటూ బిగ్‌ బాస్‌ ఎలిమినేట్‌ చేయడం జరిగింది. సోషల్‌ మీడియాలో గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రకారం వితిక షేరు ఎలిమినేట్‌ అవుతుందేమో అనుకున్నారు. కాని జాఫర్‌ ఎలిమినేట్‌ అవ్వడం చాలా మందికి ఆశ్చర్యంను కలిగించింది.

ఎలిమినేషన్‌ లో ఒకొక్కరిని సేవ్‌ చేస్తూ వచ్చిన నాగార్జున చివర్లో జాఫర్‌ మరియు వితికలను ఉంచాడు. దాంతో ఖచ్చితంగా వితికనే అనుకున్నా కూడా జాఫర్‌ బయటకు వచ్చేశాడు. జాఫర్‌ ఇంట్లో వారితో కలిసి పోలేక పోవడంతో పాటు తన కుటుంబంను మిస్‌ అవుతున్నాడు. దాంతో ఆయన నన్ను ఎలిమినేట్‌ చేయండి అంటూ కోరడం కూడా జరిగింది. అయితే ఎలిమినేషన్‌ లో ఉన్న అతడు కొన్ని సార్లు ఉండాలనే అనుకున్నాడు. పోయే ముందు కూడా ఎమోషనల్‌ అయ్యాడు. ఆయన వెళ్లి పోవాలనుకున్నా కూడా ప్రేక్షకులు ఓట్లు బాగానే వేశారని, వితిక షేరు కంటే కూడా అధికంగా పడి ఉంటాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జాఫర్‌ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయక పోవడంతో పాటు ఇచ్చిన టాస్క్‌ లను కూడా ఆయన పూర్తి చేయడం లేదని బిగ్‌ బాస్‌ టీం ఆయనకు ఓట్లు పడ్డా కూడా వితికను సేవ్‌ చేసి ఆయన్ను ఎలిమినేట్‌ చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుణ్‌ సందేశ్‌.. వితికలు ఇద్దరు ఉంటే ఇంకొన్ని రోజుల పాటు వారిద్దరి రొమాన్స్‌ మరియు గొడవలతో మంచి రేటింగ్‌ వస్తుందనే ఉద్దేశ్యంతో బిగ్‌ బాస్‌ టీం వితికను ఉంచారనే వాదన కూడా వినిపిస్తుంది. మొత్తానికి జాఫర్‌ ఎలిమినేషన్‌ పై అనేక అనుమానాలు నెటిజన్స్‌ వ్యక్తం చేస్తూ.. మీమ్స్‌ కూడా చేస్తున్నారు.