Begin typing your search above and press return to search.
ఏంటి.. 'సలార్' చిత్రాన్ని 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారా.. నిజమేనా?
By: Tupaki Desk | 21 Jun 2021 6:30 AM GMTఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అనేక సీక్వెల్ సినిమాలను చూశాం. సూపర్ హిట్ అయిన సినిమాలకి కొనసాగింపుగా అదే ఫ్రాంచైజీలో మరికొన్ని చిత్రాలను రూపొందిస్తుంటారు. అయితే ఒకే చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడం అనేది 'బాహుబలి' చిత్రంతో మొదలయ్యింది. దర్శకధీరుడు రాజమౌళి - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ చిత్రాన్ని 'బాహుబలి - ది బిగినింగ్' 'బాహుబలి - ది కన్క్లూజన్' పేర్లతో రిలీజ్ చేసి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసారు. దీంతో మరికొన్ని చిత్రాలు ఇదే ప్రయోగాన్ని అనుసరిస్తున్నాయి.
దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' చిత్రాన్ని రెండు చాప్టర్స్ గా చెప్పడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే విడుదలైన చాప్టర్-1 బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న 'KGF: చాప్టర్ 2' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఒక్క సినిమాగా చెప్పడం కష్టమని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 'పుష్ప 1' ఇప్పటికే మెజారిటీ షూట్ కంప్లీట్ చేసుకుంది.
అయితే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'సలార్' చిత్రాన్ని కూడా రెండు పార్ట్స్ గా విడుదల చేయనున్నట్లు ఓ న్యూస్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని 'కేజీఎఫ్' మాదిరిగా 2 భాగాలుగా చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని హీరో ముందు పెట్టారట. ఇప్పుడు ప్రభాస్ - ప్రశాంత్ మధ్య దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. అయితే దీనికి ప్రభాస్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది.
డార్లింగ్ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే స్క్రిప్ట్ డెవలప్మెంట్ - బడ్జెట్ తదితరుల అంశాల గురించి చర్చించనున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఒకవేళ రెండు భాగాలుగా చేసే ఆలోచన నిజమే అయితే 'బాహుబలి' తర్వాత ప్రభాస్.. 'కేజీఎఫ్' తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వచ్చే 2 పార్ట్స్ సినిమా అవుతుంది. కాగా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం 2022 ఏప్రిల్ 23న 'సలార్' రిలీజ్ కానుంది.