Begin typing your search above and press return to search.
సెకెండ్ ట్రైలర్ తో 'రాధేశ్యామ్' లెక్కలన్ని సెట్!
By: Tupaki Desk | 27 Feb 2022 1:30 PM GMTపాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` ట్రైలర్ తోనే అంచనాలు ఆకాశన్నంటడం మొదలైంది. రొటీన్ కి భిన్నంగా ఉన్న ట్రైలర్ ప్రభాస్ అభిమానులకు ట్రైలర్ బిగ్ ట్రీట్ అందించింది. పాతకాలపు యూరిపియన్ ఫీల్స్..ప్రభాస్..పూజాహెగ్డే లుక్ పరంగానూ సినిమాలో సమ్ థింగ్ ఉందని అర్ధమైంది.
కానీ అభిమానులకు ఆ కిక్ సరిపోదు. ఇంకా రెట్టింపు కిక్ అవసరం. మరి అందుకు సెకెండ్ ట్రైలర్ తో అన్ని లెక్కలు సరిచేయడానికి రెడీ అవుతుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.
సెకెండ్ ట్రైలర్ తో దుమ్ము దుమారమే అన్న టాక్ రిలీజ్ కి ముందే టాక్ స్ర్పెడ్ అవుతోంది. ట్రైలర్ లో మూడు కొత్త విషయాలు ప్రధానంగా హైలైట్ అవుతాయని సమాచారం. థమన్ మ్యాస్ర్టో బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాలో కొన్ని అద్భుతమైన విజువల్ ట్రీట్ తో నిండిన షాట్లు.. రాజమౌళి వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని గుసగుస వినిపస్తోంది.
ఇప్పటికే థమన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. `అఖండ`..`భీమ్లా నాయక్`..`సర్కారు వారి పాట` లకు అందించిన మ్యూజిక్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అదే టెంపో `రాధేశ్యామ్` ట్రైలర్ తోనూ కొనసాగిస్తాడని టీమ్ ధీమాగా ఉందిట.
ఇక విజువల్ గా సినిమా హైలైట్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోస్టర్లలో ఇటలీ అందాలు..అవసరం మేర అద్భుతమైన సెట్ల నడుమ సన్నివేశాలు సినిమాని అలా ఒక్కసారిగా పైకి లేపుతాయని డిస్కషన్ సాగుతోంది. ఇక పాన్ ఇండియాని ని దాటి పాన్ వరల్డ్ లో ఫేమస్ రాజమౌళి వాయిస్ ఓవర్ ప్రధాన అస్సెట్.
వీటన్నింటిని కలగలిపి కొత్త ట్రైలర్ తో శ్యామ్ ముందకొస్తాడని తెలుస్తోంది. ఈసారి విజువల్ ట్రీట్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ని హైలైట్ చేయబోతున్నారన్నది ఇన్ సైడ్ టాక్.
ఈ ఒక్క ట్రలర్ తో అన్ని లెక్కలు సరిచేస్తారని తెలుస్తోంది. ప్రేక్షకాభిమానుల అంచనాల్ని మించి ట్రైలర్ ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి అసలు కథ ఎలా ఉంటుందన్ని రిలీజ్ తర్వాత మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాలు యూనిట్ ధృవీకరించాల్సి ఉంది.
మార్చి 11న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ కొత్త ట్రైలర్ తో ప్రచారం పనులు ముమ్మరం చేసే అవకాశం ఉంది. ట్రైలర్ రిలీజ్ అనంతరం భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించే అవకాశం ఉంది. కోవిడ్ థర్డ్ వేవ్ కూడా తగ్గింది కాబట్టి అభిమానుల సమక్షంలో వేడుక నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి `జిల్` ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వ వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.