Begin typing your search above and press return to search.

నెపోటిజ‌మ్ పై అల్లు అర‌వింద్ అలా అన్నాడేంటీ?

By:  Tupaki Desk   |   3 Dec 2022 9:56 AM GMT
నెపోటిజ‌మ్ పై అల్లు అర‌వింద్ అలా అన్నాడేంటీ?
X
ఆహా ఓటీటీలో నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా మొద‌లైన అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఫ‌స్ట్ సీజ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో ఆహా టీమ్ రీసెంట్ గా సీజ‌న్ 2ని మొద‌లు పెట్టింది. తొలి ఎపిసోడ్ ని పొలిటిక‌ల్ యాంగిల్ లో మాజీ ముక్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ తో మొద‌లు పెట్టారు. ఈ ఎపిసోడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో అదే ఊపులో సీజ‌న్ 1 కు పూర్తి భిన్నంగా సీజ‌న్ 2 ని ప్లాన్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

సీజ‌న్ 2 ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ కావ‌డం.. అవి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్టార్ ప్రొడ్యూస‌ర్స్‌, వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ లు అల్లు అర‌వింద్‌, డి. సురేష్ బాబు, కె. రాఘ‌వేంద్ర‌రావు, ఏ. కోదండ రామిరెడ్డిల‌తో ప్ర‌త్యేక ఎపిసోడ్ ని సిద్ధం చేశారు.

ఈ న‌లుగురు లెజెండ‌రీ ప‌ర్స‌నాలిటీస్ పాల్గొన్న తాజా ఎపిసోడ్ ని డిసెంబ‌ర్ 2 న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ముందు విడుద‌ల చేసిన ప్రోమో వైర‌ల్ కావ‌డంతో ఎపిసోడ్ ఏ రేంజ్ లో వుంటుందో అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు.

శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తాజా ఎపిసోడ్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజా ఎపిసోడ్ లో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌తో పాటు ఇండస్ట్రీలో వున్న కీల‌క విష‌యాలు, వివాదాస్ప‌ద అంశాల‌పై ప్ర‌ధానంగా మాట్లాడుకున్నారు. ఇండ‌స్ట్రీలో నెపోటిజ‌మ్ పై గ‌త కొన్నేళ్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది. నెట్టింట దీనిపై ఓ రేంజ్‌లో 'అల వైకుంఠ‌పుర‌ములో' టైమ్ లో ట్రోలింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

దీనిపై ఈ షోలో స్పందించిన బాల‌య్య నేను కూడా నెపో కిడ్ నే అంటూ చెప్పుకొచ్చారు. అయితే నెపోటిజ‌మ్ పై మీ అభిప్రాయం ఏంట‌ని అల్లు అర‌వింద్ ని ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధాన‌మిస్తూ అల్లు అర‌వింద్ షాకింగ్ గా స్పందించారు. నేను పూర్తిగా నెపోటిజంలో మునిగి ఉన్నాను. దీనిపై న‌న్ను చాలా మంది ట్రోల్ చేస్తారు. ఆ ట్రోల్స్ చేసే వాళ్ల‌ని నేను అడుగుతున్నా గుండె మీద చెయ్యివేసుకుని చెప్పండి.. మీ కుటుంబంలో ఒకే ప‌ని చేసే వాళ్లు లేరా?.. మీ ఫ్యామిలీ వార‌స‌త్వాన్ని మీరు కొన‌సాగించ‌రా? అస‌లు మా ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు.

నేను వేరే ప‌ని చూసుకుంటాను అన్న వాళ్లు న‌న్ను ట్రోల్ చేయండి. నా ఫ్రెండ్ ఒక‌త‌ను లాయ‌ర్‌. అత‌ని పేరెంట్స్ కూడా లాయ‌ర్సే. మ‌రి అది నెపోటిజం అవ్వ‌దా?. మ‌నం పెరిగే ప‌రిస‌రాల‌ను బ‌ట్టి మ‌నం ఏమి అవ్వాల‌ని నిర్ణ‌యించుకుంటాం. సినిమాల్లో ఉన్న వాళ్లు సినిమాల్లోకి రావాల‌నుకుంటారు. అయినా రాజ‌కీయాలు, డాక్ట‌ర్స్‌.. ఇలా అన్ని వృత్తుల్లో నెపోటిజం వుంది. కానీ కేవ‌లం సినిమా వాళ్ల‌నే ఎందుకు అంటారు? అని ఎదురు ప్ర‌శ్నించారు. డి. సురేష్ బాబు మాత్రం నెపోటిజం అనేది ఓన్లీ ఫ‌స్ట్ స్టెప్ మాత్ర‌మే. అల‌ర్ట్‌, టాలెంట్ లేక‌పోతే స‌క్సెస్ రాదు. నెపోటిజంలో వున్న వాళ్లంద‌రికి స‌క్సెస్ రాదు క‌దా? అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.