Begin typing your search above and press return to search.

పూరి కోసం రామ్ ఏం చేసాడంటే ?

By:  Tupaki Desk   |   5 Dec 2019 1:30 AM GMT
పూరి కోసం రామ్ ఏం చేసాడంటే ?
X
కెరీర్ డౌన్ ఉన్నప్పుడు తమకి హిట్ ఇచ్చిన దర్శకుడిని ఎవరూ ఈజీగా మర్చిపోరు. అలంటి దర్శకులు ఏదైనా అడగాలే కానీ ఏం చేయడానికైనా హీరోలు రెడీగా ఉనారు. అయితే ఇప్పుడు రామ్ కూడా పూరి కోసం అడగ్గానే ఓ గెస్ట్ రోల్ చేసేశాడు. కెరీర్ డౌన్ అవుతున్న టైంలో 'ఇస్మార్ట్ శంకర్' తో రామ్ కు కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చాడు పూరి.

అఫ్కోర్స్ ఆ సినిమా రామ్ కి ఎంత ప్లస్ అయిందో పూరి కూడా అంతే అనుకోండి. అయితే ఇస్మార్ట్ శంకర్ తో పూరి కి బాగా దగ్గరయ్యాడు రామ్. పూరి కూడా రామ్ మీద అంతే లవ్ చూపిస్తూ బాండింగ్ కొనసాగిస్తున్నాడు. ఆ చనువుతోనే పూరి కథతో ఆకాష్ హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' సినిమాలో గెస్ట్ రోల్ చేయమని అడిగాడట పూరి.

దానికి వెంటనే ఒకే చెప్పేసి ఎప్పుడు షూట్ కి రమ్మంటారు అని అడిగాడట రామ్. ఇటివలే జరిగిన గోవా షెడ్యుల్ లో రామ్ పాల్గొని రొమాంటిక్ షూట్ చేసెసాడట. మరి రామ్ గెస్ట్ రోల్ ఎలా ఉంటుంది సాంగ్ లో వస్తాడా లేదా ఏదైనా ఫైట్ సీక్వెన్స్ లో మెరుస్తాడా అనేది తెలియాల్సి ఉంది.