Begin typing your search above and press return to search.
ఏపీకి టాలీవుడ్ ఏమిచ్చింది...?
By: Tupaki Desk | 10 Jun 2020 11:38 AM GMTఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా కోరుతూ టాలీవుడ్ సినీ ప్రముఖుల బృందం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి టాలీవుడ్ తరపున స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, పీవీపీ, డైరెక్టర్ రాజమౌళి తదితరులు సీఎం వైఎస్ జగన్ ని కలిసిన వారిలో ఉన్నారు. ఈ భేటీలో సినీ పెద్దలు లేవనెత్తిన అంశాలపై స్పందించిన జగన్ మోహన్ రెడ్డి ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అన్ని విధాలా ప్రభుత్వ సహకారం ఉంటుందని స్పష్టం చేసారు. సినీ ఇండస్త్రీ వారితో సమన్వయం చేయాల్సిందిగా సూచిస్తూ సీఎం జగన్ ఆ బాధ్యతను మంత్రి పేర్ని నానికి అప్పగించారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని మరియు చిరంజీవి ఈ విషయమై స్పందిస్తూ ముఖ్యమంత్రికి సినీ ప్రముఖులకు మధ్య జరిగిన చర్చల వివరాలను వెల్లడించారు.
చిరు మాట్లాడుతూ ప్రభుత్వం మేము అడిగిన అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించి తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పిన మాట మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ కరెంటు బిల్లులకు సంబంధించి మినిమం డిమాండ్ ఎత్తివేతకు అంగీకరించారు. చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఆయా సినిమాలను బట్టి టికెట్ ధర పెరుగుతూ ఉంటుంది. దీని వల్ల భారీ బడ్జెట్‌తో సినిమాలు చేసే నిర్మాతలకు లాభం చేకూరుతుంది. కాబట్టి ఫ్లెక్సీ రేట్ల మీద వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అలానే పారదర్శకత కోసం సినిమా టికెట్స్ ని ఆన్ లైన్ లోనే విక్రయించాలని.. ఎక్కడా బ్లాక్ మార్కెట్ కు కానీ మాల్ ప్రాక్టీస్ కు గానీ అవకాశం ఉండదు. గతంలో వైజాగ్ ప్రాంతం మీద దృష్టి పెట్టి గతంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 300 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిలో ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తామని చిరంజీవి వెల్లడించారు.
అయితే ఇప్పుడు కొంతమంది ఏపీ ప్రజలు సినీ ఇండస్ట్రీ వారు ఏపీకి ఏమి చేసారని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలి.. స్టూడియోల నిర్మాణాలకు భూమిని ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో షూటింగ్స్ కి అనువైన ప్రదేశాలు ఉన్నా దూరమవుతుందని ఇన్ని రోజులు పెద్దగా ఇక్కడ షూటింగ్స్ జరపకుండా కేవలం తెలంగాణా రాష్ట్రంలో సినిమాలు నిర్మించుకుంటూ.. అక్కడి వారికి ట్యాక్సులు కడుతూ ఇప్పుడు భూములు కావాలని అడుగుతున్నారని విమర్శిస్తున్నారు. అప్పుడప్పుడు విపత్తుల సమయంలో అరకొర సాయం చేసి ఇప్పుడు ప్రభుత్వం నుండి పెద్ద సహాయాన్ని ఆశిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ లో ఇంద్ర భవనాలను నిర్మించుకొని నివాసం ఉంటున్న సినిమా వాళ్ళు ఇక్కడ స్థలాలు ఇస్తే మాత్రం ఇక్కడికి వచ్చి స్థిర పడతారా అంటూ హెద్దేవా చేస్తున్నారు. మొత్తం మీద అసలు టాలీవుడ్ ఏపీకి ఏమిచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు.