Begin typing your search above and press return to search.
నేటితరం సెన్సేషనల్ గాయని మంగ్లీ గురించి మీకేం తెలుసు?
By: Tupaki Desk | 3 March 2021 6:30 AM GMTఅక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన `లవ్ స్టోరి` నుంచి ఇటీవలే `సారంగ దరియా...` సాంగ్ ప్రోమో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పటికే 2 కోట్ల వ్యూస్ ని అధిగమించి యూట్యూబ్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది. సాంగ్ లో వాణి బాణి రెండిటికీ సంగీత ప్రియులు స్పెల్ బౌండ్ అయిపోతున్నారు. యూత్ కి అంతగా కనెక్టయిపోయిన ఈ క్రేజీ సాంగ్ పాడింది ఎవరు? అంటే.. ట్యాలెంటెడ్ మంగ్లీ అంటూ యువతరం వెంటనే చెప్పేస్తోంది. ఇటీవలి కాలంలో పరభాషా గాయనీమణుల వెల్లువలో ఉవ్వెత్తున ఎగసుకుని వచ్చిన గొప్ప తెలుగమ్మాయిగా మంగ్లీ పేరు మార్మోగుతోంది.
మంగ్లీ ఇటీవల ఏ సినిమాలో పాడినా ఆ పాట బంపర్ హిట్టే. 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో చిత్రంలో రాములో రాములా లాంటి చార్ట్ బస్టర్ సాంగ్ ని ఆలపించింది. మొన్న రిలీజైన క్రాక్ లో భూమ్ బద్దల్ సాంగ్ అంతే పాపులరైంది. శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో టైటిల్ పాటను మంగ్లీనే ఆలపించగా దానికి మంచి పేరొచ్చింది.
యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ గాయనిగా స్థిరపడ్డారు. టాలీవుడ్ లో నేటితరంలో ప్రతిభావనిగా గుర్తింపు తెచ్చుకుని బిజీ గాయనిగా రాణిస్తోంది. తన స్వరానికి అభిమానుల నుంచి ఎంతో ప్రేమను మంగ్లీ అందుకుంటున్నారు.
ఇంతకీ `సారంగ దరియా..` పాట కోసం మంగ్లీ అందుకున్న పారితోషికం ఎంతో మీకు తెలుసా? ఈ ఒక్క పాట కోసం లక్షల్లో చెల్లించినట్లు పరిశ్రమ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంగ్లీ టాలీవుడ్లో టాప్ 10 లో ఒకరిగా రాణిస్తోంది.
మంగ్లీ నేపథ్యం పరిశీలిస్తే.. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నాయి. మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్ (జననం 10 జూన్ 1994) మంగ్లీ చిన్మయి అనే టీవీ స్క్రీన్ పేరుతో ప్రసిద్ది చెందింది. మంగ్లీ సాంప్రదాయ బంజారా వేషధారణతో బుల్లితెరపై ప్రసిద్ది చెందింది. ఆమె తెలంగాణ యాసతో ఆలపించిన పాటలకు యూట్యూబ్ లో విశేష ఆదరణ దక్కింది.
ఇక పండగలు పబ్బాలకు విదేశాలలోనూ మంగ్లీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ- బోనాలు- సంక్రాంతి వంటి ప్రత్యేక పండగల్లో మంగ్లీ ప్రదర్శన గురించి తెలిసినదే. తెలంగాణ నిర్మాణ దినోత్సవం.. ఉగాది.. సమ్మక్క సారక్క జతార మొదలైన ప్రత్యేక సందర్భాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో సాంగ్స్ లో మంగ్లీ నటించారు.
మంగ్లీ బంజారా సమాజంలో జన్మించారు. ఆమె SV విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. ఆమె తండ్రి చిన్న వయస్సు నుండే కుమార్తెను గాయకురాలిని చేయాలనే తపనతో ప్రోత్సహించారు. తనకు స్కూల్ కాలేజీల్లో ఉపాధ్యాయుల నుంచి ప్రేరణ లభించింది. తనకు ఉన్న సంగీతాభిరుచితో సంగీత ఉపాధ్యాయురాలిగా మారాలని అనుకున్నారు. కానీ ఉపాధి కోసం.. యాంగరింగ్ వృత్తిని ప్రారంభించడానికి మంగ్లీ హైదరాబాద్ .. బెంగళూరుకు వెళ్లారు. ఈ ప్రయాణంలోనే గాయనిగా టాలీవుడ్ లోనూ అడుగుపెట్టి రాణిస్తున్నారు.