Begin typing your search above and press return to search.
దీపికా పదుకొణే గురించి మీరేమనుకుంటున్నారు!
By: Tupaki Desk | 24 Sep 2022 5:48 AM GMTబాలీవుడ్‌లో దీపికా పదుకొనే స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడా బ్యూటీ అక్కడ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అవుతున్నారు. స్టార్ హీరోలే దీపిక డేట్ల గురించి వెయిట్ చేసే సన్నివేశం ఎదురవుతుందంటే? దీపిక ఏ రేంజ్ కి చేరుకుందో చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఎంత బీజీగా ఉందో..బ్రాండ్స్ ని ఎండార్స్ చేయడంలోనూ అమ్మడు అంతే బిజీ.
ఈ అందమైన నటి ఫ్యాషన్ ఎంపికలు అంతే ఆసక్తికరం. సాంప్రదాయ దుస్తులను మరియు సాధారణ దుస్తులు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అన్ని వర్గాల ప్రియుల్ని ఆకట్టుకుంటుంది.
తాజాగా అమ్మడు మరో కొత్త ఫోటోతో నెటి జనులు ముందుకొచ్చేసింది. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌కి లో ఇటీవలి యాడ్ షూట్ నుండి కొన్ని బీటీఎస్ చిత్రాలను షేర్ చేసింది. "నేను దేని గురించి ఆలోచిస్తున్నానని మీరు అనుకుంటున్నారు..." అని తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
ఇందులో దీపికా లేత నీలం రంగు డెనిమ్ జాకెట్‌లో ఎంతో అందంగా కనిపిస్తుంది. మ్యాచింగ్ బ్యాగీ డెనిమ్ ప్యాంటు మరియు పీచు లాంటి టీ-షర్ట్‌తో తో వావ్ అనిపిస్తుంది. మల్టిపుల్ చెవిపోగులు -పోనీటైల్‌తో తన రూపాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేసి మరింత హీటెక్కిస్తున్నారు.
దీపికా పదుకొణె సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం బాద్ షా షారుక్ ఖాన్ సరసన యాక్షన్-థ్రిల్లర్ 'పఠాన్'లో నటిస్తుంది. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాతో అమ్మడు షారుక్ తో మరోసారి తెరను పంచుకోవడం విశేషం. అలాగే ఇదే దర్శకుడు తెరకెక్కిస్తోన్న 'ఫైటర్' లోనూ దీపిక నటిస్తుంది. ఈ ఏరియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హృతిక్ రోషన్‌తో జత కడుతుంది.
అలాగే దీపికా పదుకొణె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌తో తెలుగు లో అరంగేట్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా ప్రాజెక్ట్ K టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.