Begin typing your search above and press return to search.

డ్రామాలాడొద్ద‌న్న షామా.. ఏంద‌మ్మా నీ రుబాబ్ ?

By:  Tupaki Desk   |   12 Jan 2021 6:55 AM GMT
డ్రామాలాడొద్ద‌న్న షామా.. ఏంద‌మ్మా నీ రుబాబ్ ?
X
కొటేష‌న్లు ఇవ్వ‌డం వేరు. వాటిని ఆచరించి నిరూపించ‌డం వేరు! ఆ రెండోది చాలా చాలా క‌ష్టం. అందాల న‌టి షామా శికంద‌ర్ కొటేష‌న్ చూస్తుంటే కాస్త కాంప్లికేటెడ్ స‌బ్జెక్ట్ నే ట‌చ్ చేసింద‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది.

ఇంత‌కీ షామా ఏమంది? అంటే.. డ్రామాల‌కు తావివ్వ‌కుండా జీవితంలో ల‌క్ష్యాల్ని నిర్ధేశించుకుని ముందుకు సాగాల‌ని సూచించింది. ``అర్థం ప‌ర‌మార్తం.. విజ‌న్ ఉన్నవారికి నాటకాలాడేందుకు సమయం ఉండ‌దు. వారు తమ శక్తిని సృజనాత్మకతకు పెట్టుబడిగా పెడతారు. సానుకూల జీవితాన్ని గడపడంపై దృష్టి పెడతారు. మంచి ఉద్దేశ్యంతో జీవించండి`` అంటూ గ‌ట్టిగానే క్లాస్ తీస్కుంది షామా.

షామా సికందర్ తన హాట్ బికినీల్ని.. పూల్ సైడ్ ట్రీట్ ని నిరంత‌రం అభిమానుల‌కు షేర్ చేసేందుకు తరచుగా సోషల్ మీడియాల‌ను అనుస‌రిస్తుంటుంది. ఈ ఉదయం అదిరిపోయే రెడ్ హాట్ ఫోటోను షేర్ చేసిన షామా అందుకు త‌గ్గ కొటేష‌న్ ని ఇచ్చింది.

అయితే ఈ కొటేష‌న్స్ అన్నిటినీ షామా ఎక్క‌డి నుంచి కాపీ చేస్తుందో క‌నిపెట్టేసాం. ప‌ర్షియ‌న్ క‌వి.. తత్వవేత్త రూమీ కొటేష‌న్స్ ని ఈ అమ్మ‌డు కాపీ చేస్తుంది. ఇంత‌కుముందు షామానే ఈ విష‌యంపై లీకులు ఇచ్చింది. “నేను రూమిని ప్రేమిస్తాను. వాస్తవానికి వారి ఆత్మ నుండి మాట్లాడే ప్రజలంద‌రినీ నావాళ్లు అనుకుంటున్నాను. అతను వారిలో ఒకడు. రుమీ అంత ప్ర‌భావ‌వంతంగా క‌విత‌లు రాస్తారు. అత‌డిది హృదయాన్ని తాకే భాష” అంటూ ఎమోష‌న‌ల్ గా చెప్పుకొచ్చింది.

“నాకు తత్వశాస్త్రంపై అమితాస‌క్తి. నేను ఓషోను చదివాను. అబ్రహం హిక్స్ .. జో డిస్పెంజా .. రూమీ ఇలా ఎంద‌రివో పుస్త‌కాల‌ను చదువుతున్నాను. వారంతా ఆత్మ ఉన్న‌ భాష మాట్లాడతారు. నాకు నేను రూమీ రచనను ప్ర‌త్యేకంగా ప్రేమిస్తాను. నేను పుస్తక ప్రేమికురాలిని కాను. నేను ఎప్పుడూ బ్యాడ్ పాఠకురాలిని. కానీ ఆలస్యంగా అయినా అందులో మెరుగ‌య్యాను” అంటూ చాలా సంగ‌తులే చెప్పింది. షామా వేదాంతం త‌త్వం మాటేమో కానీ ప్ర‌స్తుతానికి ఈ రెడ్ హాట్ బికినీ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.