Begin typing your search above and press return to search.
పూనమ్ కౌర్ ఏం చెప్పాలనుకుంటోంది?
By: Tupaki Desk | 2 Oct 2021 3:30 PM GMTపూనమ్ కౌర్ .. తెలుగు తెరకి పరిచయమై చాలాకాలమే అయింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ . కన్నడ .. హిందీ ప్రేక్షకులను కూడా పలకరించింది. అయితే ఆయా భాషల్లో కూడా ఆమె చేసిన సినిమాలు తక్కువే. తెలుగులో చేసిన సినిమాల్లో 'శౌర్యం' .. 'నాగవల్లి' .. 'గగనం' .. 'శ్రీనివాస కల్యాణం' సినిమాలు కనిపిస్తాయి. పూనమ్ కౌర్ మంచి అందగత్తె అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటి స్టార్ హీరోయిన్ల పాటి నటన ఆమెకి రాకపోలేదు. కానీ ఎందుకనో ఆమె సోలో హీరోయిన్ గా అవకాశాలను సంపాదించలేకపోయింది.
సాధారణంగా ఆ మాత్రం గ్లామర్ ఉన్నవాళ్లు భారీ సినిమాల్లో అవకాశాలు రానప్పుడు చిన్న సినిమాలైనా చేసుకుంటూ వెళతారు. ఆ వరుసలోనైనా కొన్ని హిట్లను తమ ఖాతాలో వేసుకుంటారు. కానీ అలాంటి సినిమాలు కూడా ఆమె జాబితాలో కనిపించవు. కథానాయికలు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండరు. ఒక భాషలో తమకి అవకాశాలు లేకపోతే ఆ వెంటనే ఇతర భాషల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడ రాణించడానికి తమవంతు కృషి చేస్తుంటారు. కానీ పూనమ్ కౌర్ కెరియర్ చూస్తే, ఇతర భాషల్లోని సినిమాలపై కూడా ఆమె పెద్దగా దృష్టి పెట్టినట్టు కనిపించదు.
సినిమాల నుంచి అవకాశాలు లేకపోవడంతో పూనమ్ కౌర్ సీరియల్స్ పై దృష్టి పెట్టింది. కథానాయికగా కంటే, పవన్ కల్యాణ్ కి సంబంధించిన విషయంలోనే ఆమె పేరు ఎక్కువమంది విన్నారు. ఆ మధ్య పవన్ పేరు ప్రస్తావించకుండా ఆమె పెట్టిన మెసేజ్ లు .. ఆ తరువాత ఆయన పేరును మెన్షన్ చేస్తూ పెట్టిన వాయిస్ మెసేజ్ లు హాట్ టాపిక్ గా మారాయి. అయితే పరోక్షంగా ఆమె ఏదో ఒక మెసేజ్ పెట్టడం .. ఆ వెంటనే డిలీట్ చేయడం .. చాలామందికి అసహనం కలిగించాయి కూడా. ధైర్యం ఉంటే బయటికి రావాలి .. లేదంటే మౌనంగా ఉండాలి .. అంతేగాని, ఈ ఊగిసలాట దేనికి? అనుకున్నారు.
ఇంకా ఈ అంశం అప్పుడప్పుడు తెరపైకి వస్తూ, ఆ తరువాత మబ్బుల చాటుకు వెళుతూ వస్తోంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు పోసాని ఈ అంశంపై ఆజ్యం పోశాడు. అంతే .. ఒక్కసారిగా అది భగ్గుమంటూ అంటుకుంది. చాలామంది చాలా విషయాలను పక్కన పెట్టేసి ఈ టాపిక్ ను నాలుకపై వేసుకున్నారు. థంబ్ నెయిల్ లో ఉన్నది మేటర్ లో లేనట్టు .. ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుతున్నారు. ఒక వైపున 'మా' ఎలక్షన్స్ .. మరో వైపున ఆంధ్రలో థియేటర్ల గొడవ కూడా ఉండటంతో ఏ టాపిక్ వచ్చి దేన్లో కలుస్తుందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తో కలిసి తాను దిగిన ఫొటోను పూనమ్ కౌర్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 'మా' ఎన్నికలలో ప్రకాశ్ రాజ్ గారు గెలవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆయన గెలిస్తే .. ఇప్పటివరకూ నా మనసులోనే దాచుకున్న విషయాలను .. చాలాకాలంగా తాను ఫేస్ చేస్తూ వచ్చిన సమస్యలన్నింటినీ బయటపెడతాను. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు. పెద్దలపట్ల గౌరవం .. మాట మీద నిలబడటం తెలిసిన వ్యక్తి" అంటూ రాసుకొచ్చింది. ఇలా ఆమె ప్రకాశ్ రాజ్ పట్ల తనకి గల అభిమానాన్ని చాటుతూ .. తన మద్దతును ప్రకటించింది.
'మా' ఎన్నికలు ఈ సారి మరింత రసవత్తరంగా మారాయి. ప్రకాశ్ రాజ్ .. మంచు విష్ణు .. సీవీఎల్ నరసింహారావు 'మా' అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎవరి ప్రణాళికలు వారికి ఉన్నాయి .. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. బయట నుంచి మద్దతు ఇచ్చేవారు కొందరైతే, బయటపడకుండా వెన్నుతట్టేవారు మరికొందరు. ఆరోపణలు అనే టైటిల్ కింద మాటల యుద్ధాలు సాగుతూనే ఉన్నాయి. ఈ హడావిడిలోనే ప్రకాశ్ రాజ్ కి పూనమ్ కౌర్ తనవంతు ట్వీట్ సాయం చేసింది. మళ్లీ ఇప్పుడు ఈ విషయంపై చర్చలు. ఎప్పటికప్పుడు పరిణామాలు మారిపోతున్న ఈ పరిస్థితుల్లో రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు?