Begin typing your search above and press return to search.
వీరయ్య ను ఆ 10 నిమిషాలు ఏం చేస్తుందో..!
By: Tupaki Desk | 4 Jan 2023 12:39 PM GMTమెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మరో లెవల్ అన్నట్లుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య సినిమా యొక్క రన్ టైమ్ గురించి ప్రధానంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వాల్తేరు వీరయ్య యొక్క ఫైనల్ రన్ టైమ్ ను 160 మినిట్స్ గా నిర్ణయించారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలు ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు రెండున్నర గంటలు ఉంటున్నాయి. కానీ ఈ సినిమాకు మాత్రం మరో పది నిమిషాలు అదనంగా ఉండబోతుంది.
160 నిమిషాల రన్ టైమ్ లో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండి.. ఎంటర్ టైన్‌మెంట్ ను అందిస్తే పర్వాలేదు కానీ బోర్ కొట్టించే విధంగా ఉంటే మాత్రం చాలా డ్యామేజీ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో ముందు జాగ్రత్తగా తక్కువ నిడివి ఉండేలా సినిమా నిర్మాణం సమయంలోనే ప్లాన్ చేస్తున్నారు. కొందరు పోస్ట్ ప్రొడక్షన్ సమయంలోనే ప్లాన్ చేస్తున్నారు.
కంటెంట్ పై నమ్మకం ఉన్నవారు మాత్రం మూడు గంటల వరకు కూడా వెళ్తున్నారు. రాజమౌళి వంటి దర్శకులు తీసిన సినిమాలను మూడు గంటలు కాదు నాలుగు గంటలు ఉన్నా చూడవచ్చు. కానీ ఇతర సినిమాల విషయంలో కాస్త రన్ టైమ్ విషయంలో శ్రద్ద చూపించాల్సిన అవసరం ఉంది అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.
వాల్తేరు వీరయ్య సినిమా కూడా 150 నిమిషాల రన్ టైమ్ ఉంటే సరిపోయేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.. ఆ పది నిమిషాల్లో ఏం ఉందో చూద్దాం అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో శృతి హాసన్ నటించిన విషయం తెల్సిందే. జనవరి 13న విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య కు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.