Begin typing your search above and press return to search.
SSMB28 వెనక ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 28 Jun 2022 5:30 PM GMTగత రెండేళ్లుగా అంగీకరించిన ప్రాజెక్ట్ లు కరోనా తో పాటు రక రకాల కారణాల వల్ల ఆగుతూ సాగుతూ వున్నాయి. కొంత మంది హీరోలు వ్యక్తిగత కారణాల వల్ల కూడా కొన్ని ప్రాజెక్ట్ ల షూటింగ్ లకు బ్రేకిస్తూ వస్తున్నారు. కొంత మంది మాత్రం బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లు చేస్తూ వరుసగా తమ సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెండేళ్లు తన ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఎట్టకేలకు రీసెంట్ గా 'సర్కారు వారి పాట'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.
భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని మెప్పించలేకపోయింది. పరశురామ్ డైరెక్షన్ లో మైత్రీ, 14 ప్లస్ రీల్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలవడంతో మహేష్ అభిమానులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయబోతున్న SSMB28పై దృష్టి పెట్టారు. ఈ మూవీతో మహేష్ పాన్ ఇండియా హిట్ ని సొంతం చేసుకుంటారని ఆశగా ఎదురుచూస్తున్నారు.
దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత మహేష్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో కానున్న సినిమా కావడంతో మేకర్స్ కూడా ఈ మూవీపై ప్రత్యేక వ్రద్ధ చూపిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఎస్. రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. ఇటీవలే పూజాకార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్. గత కొన్ని రోజులుగా ఈ మూవీపై రక రకాల ఊహాగానాలు వినిపిస్తూనే వున్నాయి.
పీరియాడికల్ స్టోరీ ఇదని, పాస్ట్.. ప్రజెంట్ నేపథ్యంలో ప్యారలల్ గా కథ సాగుతుందని, రెండు కాలాల్లో సాగే సినిమా కాబట్టి ఇందులో హీరో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నారని వార్తలు మొదలయ్యాయి. అయితే దర్శకుడు త్రివిక్రమ్, మేకర్స్ మాత్రం ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ని విడుదల చేయడం లేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించడం లేదు. ఈ మధ్య చాలా ఏళ్ల తరువాత మహేష్ - త్రివిక్రమ్ ల కలయికలో రానున్న సినిమా కాబట్టి చాలా ప్రత్యేకంగా చూస్తున్నామని సూర్య దేవర నాగవంశీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కానీ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? .. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు? వంటి కీలక విషయాల్ని మాత్రం వెల్లడించడం లేదు. దీంతో ఫ్యాన్స్ కొంత గందరగోళానికి లోనవుతున్నారట. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన టైమ్ లో 2022 సమ్మర్ లో రిలీజ్ అని వెల్లడించారు.
కానీ ఇంత వరకు సెట్స్ పైకి వెళ్లకపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతా బాగానే వుంది కానీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్లబోతోందన్నది మాత్రం క్లారిటీ రావడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి మది ఛాయాగ్రహణం, ఏ.ఎస్. ప్రకాష్ ఆర్ట్, ఎడిటింగ్ నవీన్ నూలి అందిస్తున్నారు.