Begin typing your search above and press return to search.
'నిశబ్దం' విషయంలో అందరూ ఎందుకు నిశబ్దంగా ఉంటున్నారు...?
By: Tupaki Desk | 25 Jun 2020 8:30 AM GMTసౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ అనుష్క - మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'నిశబ్దం'. ఈ సినిమాలో అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల.. కోన ఫిల్మ్ కార్పొరేషన్ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించగా జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. పూర్తిగా అమెరికాలో షూటింగ్ జరుపుకున్న 'నిశబ్దం' మూవీ జనవరి నెలలో రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని కారణాలతో సమ్మర్ కి వాయిదా పడింది. ఆ తర్వాత ఈ సినిమాని ఏప్రిల్ 2వ తేదీన తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నామని ప్రకటించారు. కానీ కరోనా కారణంగా థియేటర్స్ క్లోజ్ అవడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది.
కాగా ప్రస్తుతం నెలకొనివున్న పరిస్థితులు చూస్తుంటే థియేటర్స్ ఇప్పట్లో రీ ఓపెన్ చేసే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఓటీటీలలో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే డజనుకు పైగా చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో 'నిశ్శబ్ధం' మూవీని కూడా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయడానికి చర్చలు జరుపుతున్నారని వార్తలు వచ్చాయి. అప్పట్లో అనుష్క ఓటీటీ రిలీజ్ పై అసంతృప్తి వ్యక్తం చేసిందని అనుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకి రాలేదు. కాకపోతే నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ ఈ సినిమా ఓటీటీలో రిలీజయ్యే ఛాన్స్ ఉందని హింట్ ఇచ్చాడట.
కానీ ఇప్పటి వరకు 'నిశ్శబ్దం' సినిమా థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుందా.. లేదా ఓటీటీ రిలీజ్ కాబోతోందా.. ఓటీటీ విడుదలకు సిద్ధమైతే ఏ ఓటీటీలో రాబోతోంది.. అనే విషయాలపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఎందుకో తెలియదు గానీ 'నిశబ్దం' విషయంలో చిత్ర యూనిట్ నిశబ్దంగా ఉంటూ వస్తోంది. దీంతో ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కో ఓటీటీలతో బేరం కుదరలేదు అనే టాక్ వినిపిస్తోంది. దీంతో 2018లో వచ్చిన 'భాగమతి' సినిమా తర్వాత స్వీటీ అనుష్క ని పూర్తి స్థాయి రోల్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ కి నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటికే మూడు సార్లు విడుదల వాయిదా వేసుకున్న 'నిశ్శబ్దం' రిలీజ్ పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.