Begin typing your search above and press return to search.

ఏమైంది బండ్ల‌న్నా.. మోజులో ప‌డ‌టం ఏంటీ?

By:  Tupaki Desk   |   18 Jun 2022 10:05 AM GMT
ఏమైంది బండ్ల‌న్నా.. మోజులో ప‌డ‌టం ఏంటీ?
X
బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రొడ్యూస‌ర్ గా న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ కు టాలీవుడ్ లో మంచి పేరుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఈర భ‌క్తుడిగా మారి ఆయ‌న‌తో రెండు భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ ని అందించారు. జ‌యంత్ సి. ప‌రాన్జీ డైరెక్ష‌న్ లో చేసిన 'తీన్ మార్' మూవీ ఫ‌ర‌వాలేద‌నిపించినా ఆ త‌రువాత హ‌రీష్ శంక‌ర్ తో చేసిన 'గ‌బ్బ‌ర్ సింగ్‌' బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కెరీర్ కి బాగా ఊపునిచ్చింది. దాదాపు చాలా కాలం త‌రువాత ప‌వ‌న్ ఈ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకున్నారు.

అప్ప‌టి నుంచి బండ్ల గ‌ణేష్ తో ప‌వ‌న్ కు మంచి సాన్నిహిత్యం పెరిగింది. అప్ప‌టి నుంచి ప‌వ‌న్ తో సినిమా చేయ‌క‌పోయినా ఆయ‌న‌కు న‌టించిన ప్ర‌తీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో బండ్ల గ‌ణేష్ స్పీచ్ ఖ‌చ్చితంగా వుండాల్సిందే. లేదంటే ప‌వ‌న్ అభిమానులు ఒప్పుకోరు అనేంత‌గా ఆయ‌న వారితో క‌లిసిపోయారు. నిత్యం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట్ లు పెడుతూ అభిమానుల‌కు నిత్యం అందుబాటులో వుంట వ‌స్తున్నారు.

అయితే గ‌త కొన్ని నెల‌లుగా ఆయ‌న పెడుతున్న పోస్ట్ లు ప‌లు ఊహాగానాల‌కు తావిస్తున్నాయి. ప‌వ‌న్ కు ఆయ‌న‌కు మ‌ధ్య ఎవ‌రో వార‌ధి క‌ట్టేస్తున్నార‌ని, ఆయ‌న‌ని క‌ల‌వ‌నీయ‌డం లేదంటూ వార్త‌లు పుట్టుకొచ్చాయి. ఇదిలా వుంటే తాజాగా బండ్ల గ‌ణేష్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్న ఆడియో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. జీవితం ఇచ్చిన త‌ల్లిదండ్రుల్ని, క‌న్న పిల్ల‌ల్ని, భార్య‌ని త‌ప్ప ఎవ‌రినీ న‌మ్మొద్దంటూ బండ్ల గ‌ణేష్ పెట్టిన ఆడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

'జీవితంలో ఎవ‌డ్నీ న‌మ్మొద్దు.. మ‌న‌ల్ని మ‌నం న‌మ్ముకుందాం. మ‌న‌కు జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రుల్ని న‌మ్ముకుందాం. మ‌న‌ల్ని న‌మ్మి వ‌చ్చిన జీవిత భాగ‌స్వామిని, మ‌న పిల్ల‌ల్ని ప్రేమిద్దాం. వాళ్ల‌కి మంచి భ‌విష్య‌త్తుని అంద‌మైన జీవితాన్నిద్దాం.

బ‌న‌ల్ని క‌న్న త‌ల్లిదండ్రుల‌కు మంచి జీవితాన్నిద్దాం. ఎందుకంటే వాళ్లు మ‌న‌పై కోటి ఆశ‌ల‌తో వున్నారు. మ‌న పిల్ల‌ల‌కి మంచి దారి చూపిద్దాం. ఆళ్ల ఈళ్ల మోజులో ప‌డి మ‌న పిల్ల‌ల‌ని, మ‌న అమ్మా నాన్న‌ల‌ని అన్యాయం చేయోద్దు' అంటూ బండ్ల గ‌ణేష్ విడుద‌ల చేసిన ఆడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.

దీనిపై నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు. బండ్ల‌న్న ఉన్న‌ట్టుండి ఇలాంటి సందేశాలు ఎందుకు ఇస్తున్నావ్‌? ఏమైందే బండ్ల‌న్నా..?.. జీవితంలో ఎదురు దెబ్బ ఏదైనా త‌గిలిందా? అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మోజులో ప‌డ‌టం ఏంటీ? బండ్ల‌న్నా? .. ఎక్క‌డో కొడుతోందే అని ట్వీట్ లు చేస్తున్నారు. ఇంత‌కీ బండ్ల గ‌ణేష్ ఆదిఆవారం ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా ఈ ఆడియోని విడుద‌ల చేశారా? లేక ఆయ‌న‌ని ఎవ‌రైనా హ‌ర్ట్ చేశారా? అన్న‌ది తెలియాల్సి వుంది.