Begin typing your search above and press return to search.
కట్టప్ప ఏమైపోయారు? కనిపించరేం?
By: Tupaki Desk | 15 Jun 2021 9:30 AM GMT'బాహుబలి' సినిమా వచ్చిన తరువాత అందరి నోట ఎక్కువగా వినిపించిన పేరు 'కట్టప్ప'. చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ పాత్ర అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సత్యరాజ్ ను ఎక్కడ చూసినా 'కట్టప్ప' అంటూనే పిల్లలు గుర్తుపడుతున్నారంటే, ఆ పాత్ర వాళ్లని ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. తమిళంలో సత్యరాజ్ సీనియర్ స్టార్ హీరో. అనువాద చిత్రాల ద్వారా ఆయన నిన్నటి తరం ప్రేక్షకులకు తెలుసు. కానీ 'బాహుబలి'తోనే ఆయన ఈ తరం ప్రేక్షకులకు బాగా తెలిశారు. తెలుగులో 'మిర్చి' తరువాత ఆయనకి ఈ పాత్ర తగలడం నిజంగా అదృష్టం.
'కట్టప్ప' పాత్ర తీసుకొచ్చిన క్రేజ్ తో సత్యరాజ్ కి తెలుగు నుంచి వరుస అవకాశాలు వెళ్లాయి. 'జెర్సీ' .. 'ప్రతిరోజూ పండగే' సినిమాల్లో ఆయనకి మంచి పాత్రలు పడ్డాయి. 'ప్రతిరోజూ పండగే' సినిమాలో కథ అంతా కూడా ఆయన పాత్రను కేంద్రంగా చేసుకుని నడుస్తుంది. ఈ సినిమాలో ఆయన పోషించిన రఘురామయ్య పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా తరువాత కరోనా అనేది కాలు పెట్టడంతో, సినిమాల నిర్మాణాలు .. విడుదల కార్యక్రమాలు అన్నీ ఆగిపోయాయి.
లాక్ డౌన్ సమయానికి చాలామంది ఆర్టిస్టులు చాలా సినిమాలను ఒప్పేసుకుని ఉన్నారు.
కానీ సత్యరాజ్ పేరు మాత్రం ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు. లాక్ డౌన్ తరువాత మొదలైన సినిమాల్లో కూడా ఆయన పేరు వినిపించలేదు. ఇక త్వరలో ఆయన చేయనున్న సినిమాల్లో తెలుగు నుంచి ఒకటే ఉంది .. అదే 'పక్కా కమర్షియల్'. మారుతి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్నారు. తమిళ సినిమాలు మాత్రం ఓ అరడజను వరకూ ఆయన చేతిలో ఉన్నాయి. తమిళంలో బిజీగా ఉండటం వలన సత్యరాజ్ తెలుగు సినిమాలను తగ్గించారా? లేదంటే తెలుగు నుంచి ఆయనకి అవకాశాలు వెళ్లడం లేదా? అనేదే అర్థం కావడం లేదు.