Begin typing your search above and press return to search.
మెగా ఫ్యామిలీకి ఏమయ్యింది?
By: Tupaki Desk | 30 April 2022 2:30 AM GMTటాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలకు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఫ్యామిలీ హీరోల సినిమాలు థియేటర్లలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. వన్స్ ఈ ఫ్యామిలీ హీరోల సినిమా థియేటర్లలో రిలీజ్ అయిందా? ఫ్యాన్స్ చేసే హడావిడీ.. ఓ రేంజ్ లో వుంటుంది. థియేటర్ల వద్ద జాతర వాతావరణం కనిపిస్తుంది. దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత మెగా పవర్ స్టార్ `ట్రిపుల్ ఆర్`తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య మార్చి 25న ప్రేక్షకుల ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం ఎన్టీఆర్ ని మించి చరణ్ కే అత్యధికంగా ప్లస్ గా మారింది. ఎన్టీఆర్ భీమ్ పాత్రకు మించి చరణ్ అల్లూరి క్యారెక్టర్ కు ప్రాధాన్యతని ఇచ్చిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ , మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వారు జరిగింది. కూడా. దీంతో `ట్రిపుల్ ఆర్` చరణ్ సినిమా అనే స్థాయిలో చర్చ జరిగింది. ఈ సినిమాతో నార్త్ లో చరణ్ కు మంచి మైలైజ్ లభించింది. క్లైమాక్స్ లో అల్లూరి గా కాషాయం కట్టుకుని విల్లు ధరించిన బ్రిటీష్ మూకలపై చరణ్ బాణాలు సంధించిన తీరుకు నార్త్ ప్రేక్షకులు ఫిదా అయిపోయి చరణ్ ని శ్రీరాముడిగా ఊహించేసుకున్నారు.
ఈ సినిమాతో చరణ్ పాన్ ఇండియా స్టార్ ల లిస్ట్ లో చేరిపోయాడు. బాహుబలితో ప్రభాస్, పుష్ప బన్నీ పాన్ ఇండియా స్టార్ ల లిస్ట్ లో చేరితే చరణ్ `ట్రిపుల్ ఆర్`తో ఆ ఫీట్ ని సాధించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద పలు రికార్డుల్ని తిరగరాసింది. ఇప్పటికే 1100 కోట్ల మై చిలుకు వసూళ్లని రాబట్టి విజయవంతంగా ముందుకు పాగుతోంది.
అయితే ఇలాంటి టైమ్ లో `ఆచార్య`తో చరణ్ విజయ యాత్రకు బ్రేక్ పడిందని అబిమానులు వాపోతున్నారు. ఇంతకీ మెగా ఫ్యామిలీకి ఏమయ్యింది?.. ట్రాక్ తప్పుతోందేంటీ? అనే చర్చ ప్రస్తుతం అభిమానుల్లో మొదలైంది. గత కొంత కాలంగా మెగా కాంపౌండ్ లో సూపర్ హిట్ లు.. బ్లాక్ బస్టర్ లు.. ఇండస్ట్రీ హిట్లే.. అయితే ఇప్పడు సీన్ మారింది. వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. తొల చిత్రం `ఉప్పెన`తో వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా పంజా వైష్ణవ్ తేజ్ రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత `కొండ పొలం`తో అనూహ్యంగా ఫ్లాప్ ని దక్కించుకున్నాడు.
ఇక బ్యాక్ టు బ్యాక్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా `గని` తో డిజాస్టర్ ని సొంతం చేసుకున్నాడు. తాజాగా ఇదే పంధాని రిపీట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ `ఆచార్య`తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ మెగా అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచిందని చెబుతున్నారు. కథ, కథనం లేకుండా నేలవిడిచి సాము చేసినట్టుగా వుందని మెగా ఫ్యాన్స్ కౌంటర్ లు వేస్తున్నారు. ఇలా మెగా హీరోలు బ్యాక్ టు బ్యాక్ ఔట్ డేటెడ్ స్క్రిప్ట్ లతో వరుస ఫ్లాపులని దక్కించుకోవడం మెగా ఫ్యాన్స్ ని కలవరానికి గురిచేస్తోంది.