Begin typing your search above and press return to search.

అయ్య‌య్యో ర‌కుల్! ఏంటి ఇలా అయ్యింది?

By:  Tupaki Desk   |   14 July 2022 2:30 AM GMT
అయ్య‌య్యో ర‌కుల్! ఏంటి ఇలా అయ్యింది?
X
అయ్య‌య్యో ర‌కుల్! ఏంటి ఇలా అయ్యింది? ఇన్నాళ్లు ఎంతో ముద్దుగా చ‌బ్బీగా అందంగా ఉండేది. కానీ ఇప్పుడే ఎందుకిలా అయ్యింది?  చూస్తుండ‌గానే అంతా మారిపోయింది. బాగా స‌న్న‌బ‌డిపోయింది. ఒంట్లో కేజీ కండ కూడా క‌నిపించ‌డం లేదు. దానికి తోడు ముఖం బాగా లాక్కుపోయింది.  రెప్ప వాల‌ని క‌ళ్లు నిద‌ర క‌రువైనట్టుగా క్లియ‌ర్ గా క‌నిపిస్తున్నాయి. అస‌లింత‌కీ ర‌కుల్ కి ఏమైంది?

ఇంత‌కుముందు అందం కోసం స‌ర్జ‌రీ చేయించుకుంద‌ని పుకార్ వ‌చ్చింది. కానీ ర‌కుల్ ఒరిజిన‌ల్ గానే అందంగా ఉంటుంది. కానీ  ఎన్న‌టికీ త‌ర‌గ‌ని య‌వ్వ‌నం కోసం ర‌కుల్ ఇంకేదో చేస్తోంది. అందుకే ఇలా అయ్యింది! అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత‌కీ ర‌కుల్ కి ఏమైంది?  కునుకు లేని అల‌స‌ట‌ క‌ళ్ల‌తో క‌నిపిస్తోంది.

ఇటీవ‌లే తాను ఇష్ట‌ప‌డిన న‌టుడు కం నిర్మాత జాకీ భ‌గ్నానీతో డేటింగ్ లో ఉన్నానంటూ చెప్పింది. అత‌డు నిర్మిస్తున్న సినిమాల్లోనూ ర‌కుల్ భాగ‌మ‌వుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఇలా కొత్త‌గా క‌నిపిస్తోంది ఏమిటో! అంటూ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. అస‌లు త‌న‌లో అల‌స‌ట‌కు ఒత్తిడికి కార‌ణ‌మేమిటో ర‌కుల్ ఓపెన‌వుతుందేమో చూడాలి.

మామ గారి బ్యాన‌ర్ అండ‌తో

అర్జున్ కపూర్ - భూమి పెడ్నేకర్ జోడీ ది లేడీ కిల్లర్స్ లో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ఈ ముగ్గురూ తమ తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్రిప‌రేష‌న్ లో ఉన్నారు. 'మేరీ పట్నీ కా రీమేక్' అనే తాత్కాలిక టైటిల్ వైర‌ల్ అవుతోంది.  'హ్యాపీ భాగ్ జాయేగీ' దర్శకుడు ముదస్సర్ అజీజ్ మొదటిసారిగా అర్జున్- ర‌కుల్ బృందంతో ప‌ని చేస్తున్నారు. ఇది క్రేజీ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్.

ఇంత‌కుముందు'సర్దార్ కా గ్రాండ్ సన్' లో అర్జున్ కి ప్రియురాలిగా ర‌కుల్ న‌టించింది.  తాజా చిత్రం 90ల నాటి గోవిందా కామెడీ నాస్టాల్జిక్ మెమరీగా రూపొందుతుండ‌గా ర‌కుల్ కి మ‌ళ్లీ అర్జున్ స‌ర‌స‌న‌ ఛాన్స్ ద‌క్కింది. పూజా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వాసు భగ్నాని (ర‌కుల్ మామ‌గారు) నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక నిర్మాత జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ అత‌డి సొంత కుటుంబ బ్యాన‌ర్ల‌లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. బోనీ కుటుంబంతో భ‌గ్నానీల‌కు చ‌క్క‌ని సంబంధాలున్నాయి. మామ గారి బ్యాన‌ర్ కే ర‌కుల్ ప్ర‌యారిటీ? ఇస్తోంద‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. అర్జున్ కూడా బ్యాక్ టు బ్యాక్ ర‌కుల్ ప్రీత్ తో క‌లిసి న‌టిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.