Begin typing your search above and press return to search.
ఆ యూత్ హీరో ఏమయ్యాడో ?
By: Tupaki Desk | 4 July 2019 5:29 AM GMTపరిశ్రమలో టైం ఎవరికి ఎలా ఎప్పుడు నడుస్తుందో చెప్పలేం. ఇవాళ స్టార్ గా ఉన్నవాళ్ళు ఒక్క సినిమాతో జీరో కావొచ్చు. నిన్నదాకా ఎవరికి తెలియని అనామక నటుడు ఓ బ్లాక్ బస్టర్ వల్ల నిర్మాతలు క్యూ కట్టే రేంజ్ కు చేరుకోవచ్చు. ఇది ఎవరూ ఊహించేది కాదు. కాకపోతే ఒక్కసారి పేరు వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం కత్తి మీద సవాలే. ఇప్పుడో యూత్ హీరో పరిస్థితి అలాగే ఉంది. డెబ్యూ మూవీ సూపర్ హిట్. రెండో సినిమా కమర్షియల్ గా బాగా ఆడింది. మూడోది సెన్సేషన్. స్టార్ డైరెక్టర్ నిర్మాణంలో యూత్ ని టార్గెట్ చేసి తీసిన ఆ మూవీ బ్రహ్మాండమైన వసూళ్లు తెచ్చింది.
దాని తర్వాత ఇంకో హీరో కాంబినేషన్ లో చేసిన హిట్ తప్ప అప్పటినుంచి కుర్రాడికి సక్సెస్ దూరమయ్యింది. గత ఏడాది ఏకంగా మూడు డిజాస్టర్లు పలకరించి కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. సుమారు ఆరు నెలలు గ్యాప్ తీసుకుని ఓ అగ్ర నిర్మాతతో ముందే కుదిరిన ఒప్పందంలో భాగంగా ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఎలాంటి అప్ డేట్ లేదు. అసలు ఈ ఏడాది రిలీజ్ ఉంటుందా లేదా కూడా చెప్పాడం. సదరు ప్రొడ్యూసర్ మిగిలిన సినిమాల విశేషాలు చెబుతున్నాడు కానీ దీని ఊసే ఎత్తడం లేదు.
ఇది చాలదు అన్నట్టు ఇప్పుడీ హీరో తన మొదటి రెండు సినిమాల హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడు. అడిగితే అలాంటిదేమి లేదంటాడు. బయట చూస్తే పబ్లిక్ గా పబ్బులకు షికార్లకు చేతిలో చెయ్యి వేసుకుని మరీ వెళ్తున్నారు. కెరీర్ ఇలా రిస్క్ లో ఉన్నప్పుడు ఈ రియల్ లవ్ స్టోరీస్ ఎందుకో అర్థం కావడం లేదు. ఇప్పుడు చేస్తున్న సినిమా హిట్ అయ్యిందా సరే లేదా సర్డుకోవడమే అని ఇండస్ట్రీ టాక్