Begin typing your search above and press return to search.

మహేష్ 26 వెనుక ఏదో జరుగుతోంది ?

By:  Tupaki Desk   |   30 April 2019 9:22 AM GMT
మహేష్ 26 వెనుక ఏదో జరుగుతోంది ?
X
ఏదో మురారి సెంటిమెంట్ తరహాలో మహేష్ కు ఈ మధ్య ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ప్రాజెక్ట్ కోసం టై అప్ అయితే అంతగా కలిసి వస్తున్నట్టు లేదు. రెండు మూడు రోజుల క్రితం మహర్షి ముగ్గురు నిర్మాతల మధ్య ఏదో ఆర్ధిక లావాదేవీకు సంబంధించి హాట్ డిస్కషన్ జరిగినట్టు వార్త వచ్చిన సంగతి తెలిసిందే. అది ఇంకా చల్లారకుండానే మహేష్ 26 న్యూస్ ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం ముందు ప్రకటించిన ఇద్దరు నిర్మాతల్లో దిల్ రాజు తప్పుకుంటున్నట్టుగా సారాంశం. ఇది అధికారికంగా ధృవీకరించలేదు కానీ మొత్తానికి లోగుట్టు తరహాలో ఏదో తెరవెనుక జరుగుతోంది. దీని ప్రకారం అనిల్ సుంకర ఒక్కరే అనిల్ రావిపూడి సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. నిజానికి దిల్ రాజు కో పార్ట్ నర్ గా ఉన్న ఏ సినిమా నుంచి ఇప్పటిదాకా తప్పుకోలేదు.

అంతెందుకు.ఎఫ్2 బ్లాక్ బస్టర్ కొట్టాక అనిల్ ని తీసుకెళ్లి మహేష్ తో సినిమా ఓకే చేయించిందే ఈయన అనే టాక్ అప్పుడే వచ్చింది. అంతకు ముందే అనిల్ సుంకరకు మాటిచ్చాడు కాబట్టి మహేష్ ఇద్దరినీ కలిసి చేసుకోమన్నాడు. మరి ఇప్పుడు ఈ టాక్ ఇలా ఎందుకు బయటికి వచ్చిందన్నది సస్పెన్స్. షూటింగ్ ప్రారంభానికి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి క్లారిటీ కోసం వెయిట్ చేయక తప్పదు. మరోపక్క ఇదంతా ఏమో కానీ అనిల్ రావిపూడి ఇప్పటికే లొకేషన్స్ ఫైనల్ చేయడం కోసం తన టీమ్ తో కలిసి టూర్ లో బిజీగా ఉన్నాడు